Home » ఎట్టకేలకు సినిమా షూటింగ్ సెట్స్ కి హాజరైన అనుష్క శెట్టి.. !

ఎట్టకేలకు సినిమా షూటింగ్ సెట్స్ కి హాజరైన అనుష్క శెట్టి.. !

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ లలో ఒకరైనటువంటి అనుష్క శెట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపుని సంపాదించుకుంది. ముఖ్యంగా అరుంధతి, బాహుబలి వంటి సినిమాలు అనుష్క కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అని చెప్పాలి. ప్రధానంగా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. బాహుబలి తరువాత అనుష్క కెరీర్ చాలా బిజీగా ఉంటుందనుకున్నారు అందరూ. కానీ బాహుబలి తరువాత ఆమె కెరీర్ చాలా డల్ అయిపోయిందనే చెప్పాలి. 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కనిపించిన ఆమె 2020లో నిశ్చబ్దం చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. అంతకు ముందు భాగమతి చిత్రంలో నటించింది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ఒక సినిమాకు సైన్ చేసిన జేజమ్మ ఇప్పటివరకు షూటింగ్ కి మాత్రం హాజరవ్వలేదు. నవీన్, మిగతా ఆర్టిస్టులకు సంబంధించిన సీన్ లే చిత్రీకరించారు. #Anushka48 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టు అనుష్క వెల్లడించింది. యంగ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి- అనుష్క కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మిడిల్ ఏజ్ మహిళ, ఓ యువకుడి మధ్య ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నట్టు సమాచారం. ఇందులో అనుష్క మాస్టర్ చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తుంది. తాజాగా సినిమా సెట్స్ లో చేరినట్టు తెలిపిన అనుష్క త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నట్టు ప్రకటించింది. 

Advertisement

Also Read :   RGV ‘వ్యూహం’ నిర్మాతకు జగన్ సర్కారులో పదవి..

కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగానే అనుష్క సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు గత కొద్దికాలంగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత ఆమె నటించిన సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరగడంతో అనుష్కకి పలు హెల్త్ సమస్యలు వచ్చాయనే వార్తలు కూడా వినిపించాయి. అలాంటిది ఏం లేదని, తమిళ సినిమాలో ఓ షూటింగ్ సందర్భంగా తను మంచులో గాయపడిందని, గాయం కారణంగా కొంతకాలం బెడ్ కు పరిమితం కావడంతో బరువు పెరిగిందని దర్శక ధీరుడు రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టితో నటించే సినిమాలో మధ్య వయస్కురాలి పాత్రలో కాబట్టి బరువుతో పెద్దగా సమస్య లేదనే చెప్పవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  

Also Read :   కమెడీయన్‌ ఆలీకి జగన్‌ బంపర్‌ ఆఫర్‌..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !

Visitors Are Also Reading