టాలీవుడ్ హీరో నాగశౌర్య ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 10 ఏళ్లు అవుతోంది. తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే నాగశౌర్య పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఇదివరకే ఈయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు తాజాగా నాగశౌర్య పెళ్లికి ముహూర్తం ఖరారైంది.
Advertisement
నాగశౌర్య, అనూష శెట్టి అనే అమ్మాయిని నవంబర్ 20న పెళ్లి చేసుకోనున్నాడు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టి ది మంగుళూరు దగ్గరలోని కుందాపూర్. ఈమె ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో నిష్ణాతురాలు. అలాగే అనూష ఉమెన్ అచీవర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. పలు ప్రముఖ కంపెనీలకు అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్ గా పని చేసింది. 2021 నవంబర్లో ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్ మ్యాగజైన్ కవర్ పేజీపై అనూష శెట్టి ఫోటో వేశారంటే ఆ రంగంలో ఆమె ఎంత నిష్టాతురాలో స్పష్టమవుతోంది. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు బెంగుళూరులో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది. మరోవైపు నాగశౌర్య బ్రదర్ కూడా కర్ణాటకకు చెందిన అమ్మాయినే పెళ్లిచేసుకోవడం గమనార్హం.
Advertisement
Also Read : మహేష్ బాబు చేసే కసరత్తులు ఆ సినిమా కోసమేనా ?
హిందూ సంప్రదాయం ప్రకారం.. నవంబర్ 20న నాగశౌర్య, అనూష శెట్టిల పెళ్లి బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ అనే ప్రముఖ హోటల్లో జరుగనుంది. నవంబర్ 19న మెహిందీ ఫంక్షన్ నిర్వహించనున్నారు. దాదాపు వారం రోజుల ముందే నాగశౌర్య ఇంట్లో పెళ్లిసందడి మొదలుకానుందన్నమాట. ఈ పెళ్లి వేడుకకి ఇరు కుటుంబాలకు సంబంధించిన కొద్ది మంది బంధువులు మాత్రమే పాల్గొనే అవకాశముంది. పెళ్లి బెంగళూరులో జరుగుతుండడంతో.. పెళ్లి తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు బంధువుల కోసం ఏర్పాటు చేయాలని నాగశౌర్య కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
Also Read : టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నిలియోన్ ఫోటో.. అసలు ఏం జరిగిందంటే ?