Home » టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నిలియోన్ ఫోటో.. అసలు ఏం జరిగిందంటే ?

టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నిలియోన్ ఫోటో.. అసలు ఏం జరిగిందంటే ?

by Anji

 ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక పాత తరం వారికి ఆమె గురించి అంత‌గా తెలియకపోవచ్చు. కానీ ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఆమె గురించి తెలిసే ఉంటుంది. భారత సంతతికి చెందిన ఆమె అమెరికాలోని ఆ ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు పనిచేసింది. ఇక ఆ తర్వాత దాని నుంచి విరమించుకొని బాలీవుడ్ లో పలు సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

Also Read : ఈ క్యూట్ పాప హీరోయిన్ కాదు, ఒక స్టార్ హీరో వైఫ్.. ఎవరో చెప్పండి..?

 

Manam

ఇటీవలే మంచు విష్ణు హీరోగా జిన్నా అనే సినిమాలో కూడా ఆమెకు ఒక మంచి రోల్ దక్కింది. ఇప్పుడు ఈ సంగతంతా ఎందుకంటే తన హాల్ టికెట్ ఫోటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫోటో చూసి ఒక యువతి షాక్ కి గురైంది. అసలు విషయం ఏంటంటే.. ఒక యువతి కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్‌ చేసుకుంది. హాల్ టికెట్ లో తన ఫోటో బదులు సన్నీలియోన్ ఫోటో ముదిరించి ఉండటంతో ఆమె ఒక్కసారిగా ఆశ్చ‌ర్యానికి గురైంది. ఈ విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో అర్థంకాక వెంటనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే సలహాలు కోరింది. ఈ దెబ్బకి ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అయింది. వెంటనే అక్క‌డ ఉన్న‌టువంటి కాంగ్రెస్ నాయ‌కులు ఈ విషయం పై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాడు. దీంతో విద్యాశాఖ స్పందించింది.

Also Read : ఆ త‌ప్పుచేసినందుకు ఉద‌య్ కిర‌ణ్ నా కాళ్లు ప‌ట్టుకుంటాన‌న్నాడు…తేజ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

అభ్యర్థి ఫోటో తప్పుగా ముద్రించబడింది అని దానిని వెంటనే మార్చుతామ‌ని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వాస్త‌వానికి అసలు అభ్యర్థి తమ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వారు ఏ ఫోటో కనుక అప్లోడ్ చేస్తే సిస్టం ఆ ఫోటో తీసుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఆమె పొరపాటున తన ఫోటో బదులు సన్నీలియోన్ ఫోటో అప్‌లోడ్ చేశారా అనే విషయం పై సంబంధించిన అభ్యర్థిని ఆరా తీశారు. అయితే ఆమె తనకు తెలియదని తన భర్త స్నేహితుడు ఒకరు తన వివరాలు అప్లోడ్ చేశారని చెప్పారు. అస‌లు ఆ ఫోటో ఎవరు అప్‌లోడ్‌ చేశారో తెలిస్తే ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనా సన్నీ లియోన్ ఫోటో వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పక తప్పదు.

Also Read : మైత్రి మూవీ మేకర్స్ కి భారీ రివేంజ్ ప్లాన్ చేసిన నిర్మాత దిల్ రాజు.. అందుకోసమేనా ?

 

Visitors Are Also Reading