Home » రామ్‌పోతినేని – అనుపమ పరమేశ్వరన్ ప్రేమ, పెళ్లి ?

రామ్‌పోతినేని – అనుపమ పరమేశ్వరన్ ప్రేమ, పెళ్లి ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. జగడం సినిమాతో బాగా పాపులర్ అయిన హీరో రామ్… ఇటీవల కాలంలో స్కంద సినిమాతో మెరిశారు. హీరో రామ్ చేసిన తాజా సినిమా స్కంద. స్కంద సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్కంద సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతోంది.

Anupama Parameswaran Ram Pothineni Wedding Fact

Anupama Parameswaran Ram Pothineni Wedding Fact

ఇలాంటి నేపథ్యంలోనే హీరో రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హీరో రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రామ్ మరియు అనుపమ కాంబినేషన్ లో ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ప్రారంభమైందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొంతమంది అంటున్నారు.

Advertisement

Advertisement

అయితే ఈ వార్తలపై అనుపమ పరమేశ్వరన్ తల్లి స్పందించినట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు హీరో రామ్ పెళ్లిలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారని అనుపమ తల్లి వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అనుపమ పరమేశ్వరన్ మరియు టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading