Home » పెళ్లి కూతురైన అనుప‌మ‌.. షాక్‌లో ఫ్యాన్స్‌..?

పెళ్లి కూతురైన అనుప‌మ‌.. షాక్‌లో ఫ్యాన్స్‌..?

by Bunty
Ad

టాలీవుడ్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌కు అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గ‌తంతో పోల్చితే ఈ సినిమా ఆఫ‌ర్లు త‌గ్గినా అనుప‌మ‌కు సినిమా ఆఫ‌ర్లు మాత్రం వ‌స్తూనే ఉన్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించిన రౌడిబాయ్స్ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. తాజాగా అనుప‌మ పెళ్లికూతురి గెట‌ప్‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో.. ఆ లుక్‌లో అనుప‌మ‌ను చూసిన అభిమానులు ఆశ్చ‌ర్య‌పోవ‌డంతో పాటు షాక్ అవుతున్నారు. అనుపమ ప‌ర‌మేశ్వ‌రన్‌కు పెళ్లి జ‌రిగితే హార్ట్స్ బ్రేక్ అవుతాయ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Advertisement

అయితే పెళ్లికూతురి లుక్ లో అనుపమ పరమేశ్వరన్ మరింత అందంగా కనిపిస్తున్నారని కొంతమంది పేర్కొంటున్నారు. అనుపమ తన పోస్ట్ లో ఇది మీకు తెలిసిన చెస్ లాంటిది రాణి రాజుని కాపాడుతుంది దీంతో రాజును తన వశం చేసుకుంటుంది హె హె హే.. అంటూ కొంటెగా పోస్ట్ ను పెట్టారు. అనుపమ షేర్ చేసిన ఈ ఫోటోకు ఏకంగా 6 లక్షలకు పైగా లైక్స్ రావ‌డం గ‌మ‌నార్హం. అనుపమకు పెళ్లిచూపులు అయితే తట్టుకోలేమని నెటిజన్లు తమ కామెంట్ల ద్వారా అనుపమపై ప్రేమాభిమానాలు కూడా చూపుతున్నారు.

Advertisement

పెళ్లికూతురు డ్రెస్ లో అనుపమ యువరాణిలా ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తన సినీ కెరీర్ లో అనుపమ ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లోనే నటించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అనుపమ గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నారు. దర్శకులు గ్లామరస్ రోల్స్ ఆఫర్ చేస్తే అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో అనుపమకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సక్సెస్ రేట్ ఎక్కువగా లేకపోవడం ఈమెకు కాస్త‌ మైనస్ అవుతోంది. రౌడీ బాయ్స్ సినిమాతో అనుపమ బ్లాక్ బస్టర్ హిట్ ను త‌న‌ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading