తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ నటనతో… అందచందాలతో టాలెంట్ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత… అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత… నాగచైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగిపోయింది.
Advertisement
అనుపమ పరమేశ్వరన్… నితిన్ హీరోగా రూపొందిన “అఆ” మూవీతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల పక్కన కాకుండా మీడియం రేంజ్ హీరోల పక్కన నటిస్తూ అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే అనుపమ అభిమానులు ప్రస్తుతం సమంతపై చాలా కోపంగా ఉన్నారట… ఎందుకు అనుకుంటున్నారా… సమంతకు అద్భుతమైన క్రేజ్ ను వచ్చినటువంటి రెండు సినిమాల ఆఫర్లు మొదటగా అనుపమకు వచ్చాయి… కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారు అనుపమను తీసేసి అందులో సమంతను పెట్టుకున్నారు. వాటి ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ మూవీలు ఏవో తెలుసుకుందాం.
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో సమంత కంటే ముందు అనుపమను హీరోయిన్గా తీసుకోవాలి అని సుకుమార్ అనుకున్నారట. అలాగే అందుకు సంబంధించిన ఆడిషన్ కూడా జరిపాడట. కానీ ఆ తర్వాత ఎందుకో అనుపమను తీసేసి ఆస్థానంలో సమంతను పెట్టారట. ఈ మూవీ ద్వారా సమంతకు అద్భుతమైన గుర్తింపు లభించింది.
నాగ చైతన్య కొంత కాలం క్రితం శివ నర్వానా దర్శకత్వంలో రూపొందిన మజిలీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో కూడా సమంత కంటే ముందు అనుపమ ని హీరోయిన్గా తీసుకోవాలి అని మూవీ మేకర్స్ అనుకున్నారట. కానీ చివరకు ఈ సినిమాలో కూడా సమంతను తీసుకున్నారట. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇలా అనుపమ చేయవలసిన రెండు సినిమాల ఆఫర్లను సమంత కొట్టేసిందట. దానితో అనుపమ అభిమానులు సమంత పై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.