Home » వందల కోట్ల ఆస్తి.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే..!

వందల కోట్ల ఆస్తి.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే..!

by Sravanthi
Ad

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖీర్ ప్రధాన పాత్ర పోషించిన విజయ్ 69 ప్రేక్షకులు ముందుకే వచ్చింది. ఈయనకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పటిదాకా సొంతిల్లు మాత్రం లేదు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణాల కూడా చెప్పారు. సొంతంగా ఇల్లు కొనుక్కోకూడదని ఫిక్స్ అయ్యానని.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని ఎవరి కోసం ఇల్లు కొనాలని ఆయన అన్నారు. ఇంటికి ఖర్చు పెట్టే డబ్బు బ్యాంకులో వేసుకుని కొంత డబ్బుతో ప్రతినెలా అద్దె కట్టుకుంటే సరిపోతుందని అన్నారు.

Advertisement

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆస్తులు పంపకంలో పిల్లల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని… ఆస్తులు కొనకుండా డబ్బును దాచిపెట్టి దానిని పంచి పెడితే సరిపోతుందని.. ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. కెరియర్ పరంగా పీక్స్ లో ఉన్న టైం లో మా అమ్మ ఇల్లు కొనమని కోరింది. సిమ్లా లో కి ఇల్లు కొనిచ్చానని నాన్న ఉన్నప్పుడు అక్కడే ఉండే వాళ్ళమని ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ఎక్కువగా లేమని ఆయన చెప్పారు.

Advertisement

Also read:

తర్వాత ఆమె ఇక్కడ ఇల్లు కావాలని కోరిందని.. సింగిల్ బెడ్ రూమ్ చాలని చెప్పింది. కానీ ఎనిమిది బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని ఇచ్చానని నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో తర్వాత అర్థమైంది అని అన్నారు. ఈయన లాజిక్, థింకింగ్ కొత్తగా ఉన్నాయి అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading