Home » ఏఎన్నార్ కి తన భార్య అంటే ఎందుకంత ప్రేమ..? ఆయనపై వచ్చే రూమర్స్ కి ఆవిడ రియాక్షన్..

ఏఎన్నార్ కి తన భార్య అంటే ఎందుకంత ప్రేమ..? ఆయనపై వచ్చే రూమర్స్ కి ఆవిడ రియాక్షన్..

by Sravanthi
Ad

నాగేశ్వరరావు 1949లో బంధువుల అమ్మాయి అన్నపూర్ణని పెళ్లి చేసుకున్నారు. చివరి వరకు కూడా వీళ్ళ బంధం ఎంతో అన్యోన్యంగా సాగింది. అయిదుగురు పిల్లలు వీళ్ళకి ఉన్నారు. నాగార్జున, వెంకట్ కుమార్లు కాగా సరోజ, నాగ సుశీల, సత్యవతి వీరి కుమార్తెలు. తన భార్య గురించి ఏఎన్ఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పారు. ఆమె చాలా పద్ధతిగా పెరిగిందని.. ఏమీ తెలియని అమ్మాయి అని అన్నారు.

Advertisement

కొన్ని విషయాలను నేను నేర్పించాను. కొన్ని తను తెలుసుకుంది అని అన్నారు. ఎవరైనా సహాయం కోసం వస్తే గుప్పెడు ఇవ్వమంటే చాటంత ఇచ్చే రకం అని ఆయన చెప్పుకొచ్చారు. మామగారు చెప్తూనే ఉన్నారు. వీళ్ళు అలాగే ఉంటే మీకు ఏమి మిగలదని హెచ్చరించారు అని వారు చెప్పారు. డబ్బు విషయంలో నేను స్ట్రిక్ట్ గా ఉండేవాడినని అన్నపూర్ణ కి సహనం ఉంది. గొప్ప లక్షణం అని అన్నారు.

Advertisement

Also read:

హీరోని కాబట్టి నా గురించి రూమర్స్ వచ్చేవి. పైగా నా గురించి కొంత మంది పడని వాళ్ళు లేనిపోనివి కల్పించి చెప్పేవారని తన గురించి చాడీలు చెప్పే వారని అలాంటి వాళ్ళకి సరిగ్గా సమాధానం ఇచ్చేది అని నాగేశ్వరరావు అన్నారు. ఇందులో సీక్రెట్ ఏముంది అని వచ్చిన వాళ్ళని పంపించేసేవారట. ఎలాంటి రూమర్స్ ని పట్టించుకునేవారు కాదట. కొంతమంది కొత్త హీరోయిన్లు ఆయనతో నటించడానికి భయపడేవారట. అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ చనువుగా ఉండేవారట. వృత్తిలో భాగంగా హీరోయిన్లతో ఉండే ఉండాల్సి వచ్చిందని నాగేశ్వరరావు ఒక సందర్భంలో చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసం మీరు చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading