తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటీవలే భారీ ఎత్తున పోలీస్ డిపార్టుమెంట్‌లో కానిస్టేబుల్, ఎస్సైలతో పాటు గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఎక్సైజ్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి www.tslprb.in వెబ్‌సైట్ ను చూడవచ్చు.
Advertisement
విద్యార్హత వివరాలు
విద్యార్హత ఇంటర్మీయట్ పూర్తి చేసి ఉండాలి.
జులై 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. జులై 02, 2000 కంటే ముందు పుట్టి ఉండకూడదు. జులై 01, 2004 తరువాత పుట్టిన వారు అనర్హులు.
రెండేండ్ల కాలంలో 365 రోజులు విధులు నిర్వర్తించి.. ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే 18 ఏళ్ల వయసు నిండి 40 ఏళ్లు దాటకూడదు.
Advertisement
దరఖాస్తు చేయడం ఎలా..?
దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది.
తొలుత అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ను సందర్శించాలి.
అప్లికేషన్ ప్రాసెస్ మే 02, 2022 నుంచి మే 22, 2022 వరకు కొనసాగనుంది.
ఇంకెందుకు ఆలస్యం అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
Also Read :
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవుతున్నారా..? ఉద్యమంపై ఇలా సిద్ధమవ్వండి
ఆచార్య చిత్రంపై దర్శకుడు కొరటాల కామెంట్స్ వైరల్..ఆశ్చర్యం వ్యక్తం చేసిన అభిమానులు