పౌరాణిక పాత్రలకు ఎన్టీరామారావు పెట్టింది పేరు. రాముడు కృష్ణుడి పాత్రలలో నటించిన ఎన్టీఆర్ ను చూసి ఆయనే దేవుడు అనుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో మాయాబజార్ కూడా ఒకటి. ఈ సినిమా పౌరాణిక చిత్రాలలోనే రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మనం పిలుస్తున్న పాన్ ఇండియా సినిమాల కోవలోకే అప్పటి మాయాబజార్ సినిమా కూడా వస్తుంది.
Advertisement
ఈ సినిమాలో అర్జునుడిగా నటించగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శ్రీ కృష్ణార్జుణ యుద్దంలో కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి నటించారు. అయితే ఈ సినిమా తరవాత అక్కినేని సతీమని అన్నపూర్ణమ్మ ఏఎన్ఆర్ నుండి ఓమాట తీసుకున్నారు. పౌరాణిక చిత్రాలలో ఎన్టీఆర్ పక్కన నటించవద్దని అన్నపూర్ణమ్మ మాట తీసుకున్నారట. అయితే ఆ తరవాత వీరాభిమన్యు సినిమాలోనూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి నటించాలి.
Advertisement
మాయాబజార్ కాంబినేషన్ లోనే వీరాభిమన్యు సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ వీరాభిమన్యుడిగా ఏఎన్ఆర్ నటించాల్సి ఉంది. కానీ శ్రీకృష్ణార్జుణ యుద్దం సినిమా తరవాత ఎన్టీఆర్ పక్కన పౌరాణిక పాత్రల్లో నటించవద్దని చెప్పిన అన్నపూర్ణమ్మ మాట వల్ల అక్కినేని ఆ పాత్రలో నటించనని చెప్పేశారు. దాంతో అభిమన్యుడి పాత్రలో శోభన్ బాబు నటించాల్సి వచ్చింది.
శోభన్ బాబు అప్పటికి కొత్త హీరో అయినా ధైర్యం చేసి అభిమన్యుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఓ సీన్ చేయడానికే ఏకంగా నెల రోజులు పట్టిందట. గ్రాఫిక్స్ లేని కాలంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడగా చిత్రం విడుదలయ్యాక వారి కష్టానికి తగిన రిజల్ట్ వచ్చేసింది.