Home » కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నమయ్య, రామదాసు చిత్రాల రచయిత కష్టాలు ..!

కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నమయ్య, రామదాసు చిత్రాల రచయిత కష్టాలు ..!

by Anji
Ad

ఒక ఆడి కారులో రావాల్సిన స్థాయి, పేరు ప్ర‌ఖ్యాత‌లు మీవి. వైభ‌వోపేతంగా రావాల్సిన మీరు ఓలా బైకులో రావాల్సిన ప‌రిస్థితికి కార‌ణం ఏమిటంటారు అని ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు కుమార భార‌వి ఇలా స‌మాధానం చెప్పాడు. జే.కె.భార‌వి అన్నీ కార్ల‌ను చూశారు. అంత వైభ‌వోపేత‌మైన జీవితం మా అమ్మ‌ది కాదు. మా అమ్మ నారా జ‌య‌శ్రీ దేవి గారికి నేను ద‌త్త పుత్రుడిని. అందుకే నా పేరు జ‌య‌శ్రీ కుమార భార‌వి. మా అమ్మ న‌న్ను చూసుకున్న విధానం ఎవ‌రూ ఊహించ‌లేరు. అత్యంత అద్భుత‌మైన జీవితం గ‌డిపాం.

Advertisement

తెలుగులో కంటే క‌న్న‌డ‌లో జే.కే.బార‌వి చాలా ప్ర‌ఖ్యాతి గాంచాడు అని, అంత పేరు ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా క‌న్న‌డంలో అద్భుత‌మైన సినిమాలు తీశాం. ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్లు తీశాం. ఇప్ప‌టికీ కూడా ఆ రికార్డుల‌ను ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌డం లేద‌ని వెల్ల‌డించారు. అమృత‌వ‌ర్షిని, నిశ్శ‌బ్ద‌, మంజునాథ వంటి ఎన్నో సినిమాలున్నాయి. చెప్పుకుంటూ పెద్ద చ‌రిత్రే ఉంద‌ని పేర్కొన్నారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాల కింద‌ట 10 మంది హీరోల‌తో కురుక్షేత్రం సినిమా తీశాన‌ని గుర్తు చేశారు.

ALSO READ :  Latha Mangeshkar : రూ. 200 కోట్ల‌కు సంబంధించిన లతాజీ ఆస్తులు ఎవ‌రికో..?

కురుక్షేత్రం ఆల్‌టైమ్ క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఆల్‌టైమ్ హిట్ సాధించింది. ఏ సినిమా తీసినా నాకు ఒకే విధ‌మైన ఫీలింగ్‌. చిన్న‌ది అయినా పెద్ద‌ది అయినా.. ముఖ్యంగా ఐదుగురు హీరోల‌తో సినిమా చేయ‌డానికి ఒక స‌బ్జెక్ట్ ఇచ్చాను. ఉపేంద్ర‌, రాజ్‌పునిత్‌, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల కోసం.. అదేవిధంగా తెలుగులో కూడా ఐదారు స‌బ్జెక్ట్‌లు ఓకే అయి ఉన్నాయి. కానీ క‌రోనా ప‌రిస్థితిలో స‌బ్జెక్ట్‌లు విడుద‌ల అవుతున్నాయి. కానీ ఫండ్స్ విడుద‌ల కాక‌పోవ‌డంతో వాయిదా ప‌డ్డాయి.

Advertisement

ముఖ్యంగా దేవుడికి పుష్పాలు ఇచ్చి పూజించ‌డం ఏమిటంటే.. దేవుడు ఇచ్చిన పుష్పాల‌ను దేవుడికే ఇచ్చిన విధంగా, చెరువుల్లో నీరు తీసి మ‌ళ్లీ చెరువులోనే పోయడం మాదిరిగా.. సినిమాల్లో సంపాదించిన డ‌బ్బు అంతా సినిమాల్లోనే పెట్టేసాం అని స్ప‌స్టం చేశారు. జ‌గ‌ద్గురు ఆదిశంక‌ర తీయ‌క‌పోయి ఉంటే ఈ ప్ర‌శ్న మీరు అడిగే అవ‌కాశ‌ముండేది కాదు. 30 సంవ‌త్స‌రాల కాలంలో సంపాదించిన డ‌బ్బును మొత్తం ఒక్క జ‌గ‌ద్గురు ఆదిశంకాచార్య‌లో ఆయ‌న బిక్షాందేవి కృపా మ‌న‌గ‌రి స్త్రీ అని మాతా అన్న‌పూర్ణేశ్వ‌రి అని ఎప్పుడు బిక్షా పాత్ర ప‌ట్టుకుని తిరిగాడో ఆ స్థితి నాకు క‌లిగించాడు అందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు అని చెప్పాడు.

ఎందుకంటే అహంకారంతో మౌడ్యంతో విల‌య‌తాండ‌వం చేసి మాకు అంతా తెలుసు అనే ప‌రిస్థితి రాకూడ‌ద‌నే కొత్త‌గా జీవితం మొద‌లు పెట్టని అన్నాడు. అందువ‌ల్ల బైకులో రావాల్సి వ‌చ్చింది అని స‌మాధానం చెప్పాడు. బ‌స్సుల్లో కూడా జ‌ర్నీ చేసిన రోజులున్నాయి. ఎక్కువ‌గా నా క‌థ‌లు అన్ని బ‌స్సుల్లోనే ప‌డుతాయి అని వెల్ల‌డించారు. ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీలో భ‌క్తి చిత్రాల‌తో ర‌చ‌యితగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. జే.కే.భార‌వి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాస్ లాంటి సినిమాలే. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు క‌ష్టాల్లో ఉన్నాడ‌ని స్ప‌ష్టంగా ఆయ‌న మాట‌ల్లోనే చెప్పారు.

ALSO READ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేప‌ర్ క‌టింగ్స్! ది బెస్ట్ క‌లెక్ష‌న్!

Visitors Are Also Reading