Home » త‌న‌కంటే 7ఏళ్లు చిన్న‌వాడిని పెళ్లాడిన బాల‌య్య హీరోయిన్..? ఆమె భ‌ర్త ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.!

త‌న‌కంటే 7ఏళ్లు చిన్న‌వాడిని పెళ్లాడిన బాల‌య్య హీరోయిన్..? ఆమె భ‌ర్త ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.!

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి హీరోయిన్ లు చాలా మంది ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉన్నారు. ఆ లిస్ట్ లో బాల‌య్య హీరోయిన్ అంజ‌లా జవేరి కూడా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కుర్రాళ్ల ఫేవ‌రెట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెళిగింది. వెంక‌టేష్ హీరోగా న‌టించిన ప్రేమింకుందాం రా సినిమాతో అంజ‌నా జ‌వేరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకుంది. ఆ త‌ర‌వాత టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది.

Advertisement

ఆ త‌ర‌వాత నాగార్జున, బాల‌కృష్ణ‌, చిరంజీవి లాంటి స్టార్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసింది. అయితే చాలా సినిమాల‌లో న‌టించినప్ప‌టికీ అంజ‌నా జ‌వేరికి బాల‌య్య హీరోగా న‌టించిన స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాతో ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. సినిమాలో రాయ‌ల‌సీమ పౌరుషం ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టించి అద‌ర‌గొట్టింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

Advertisement

కానీ అదే అంజ‌నా జ‌వేరి కొంప‌ముంచింది. బాలీవుడ్ లో హిందిల్ హిమాల‌య అనే సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత ఆఫ‌ర్ లు లేకుండా పోయాయి. ఇక అదే స‌మ‌యంలో అంజ‌నా త‌న‌కంటే ఏడేళ్లు చిన్న‌వాడైన త‌రుణ్ రాజ్ అరోరాతో ప్రేమ‌లో ప‌డింది. అంతే కాకుండా అత‌డినే పెళ్లి చేసుకుంది.

ఇదిలా ఉంటే తరుణ్ రాజ్ కూడా విలన్ అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. త‌మిళ్ లో స్టైలిష్ విల‌న్ గా త‌రుణ్ రాజ్ కు గుర్తింపు ఉంది. అంతే కాకుండా ఖైదీ నం 150 సినిమాతో త‌రుణ్ రాజ్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆరేళ్ల క్రితం వీళ్లు పెళ్లి చేసుకోగా ఇంకా పిల్ల‌లు పుట్ట‌లేదు. మ‌రోవైపు అంజ‌నా కూడా రీఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్టు టాక్.

Visitors Are Also Reading