ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌరీ పండిట్ గురించి తెలియని వారు ఉండరు. ఆంధ్రుడు మూవీతో తెలుగు తెరకు పరిచయమైనటువంటి ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 2005లో పరుచూరి మురళి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆంధ్రుడు మూవీలో గోపీచంద్ సరసన నటించింది ఈ భామ. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.
Advertisement
అల్లరి, అమాయకత్వం, అందంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది గౌరీ. ఆంధ్రుడు సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది గౌరీ పండిట్. కానీ ఆ చిత్రాలేవీ తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె చివరిగా ‘హౌస్ ఫుల్’ చిత్రంలో నటించింది. తర్వాత బాలీవుడ్ నటుడు నిఖిల్ వివేధిని వివాహం చేసుకుంది.
Advertisement
వివాహ అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది గౌరీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ నో చెప్పింది గౌరీ. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది గౌరీ పండిట్.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
కన్నీళ్లు తెప్పిస్తున్న సౌందర్య చివరి మాటలు…!
రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?
రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !