ఇది 1915 నాటి ముచ్చట! అప్పట్లో ఇండియాను బ్రిటీషర్లు పాలిస్తున్నారు. ఇక్కడ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే వాళ్లను రాజద్రోహులుగా ప్రకటించి వారికి ద్వీపాంతర శిక్షను ఖరారు చేసేవారు. దానికోసం అండమాన్ లోని సెల్యులర్ జైలును వాడుకునేవారు. అలా 1915లో శిక్ష ఖరారైన ఖైదీలను మద్రాస్ నుండి తీసుకొని ఒక నౌక అండమాన్ కు వెళుతుంది.
Advertisement
Advertisement
ఆ నౌకలో ఒక ఖైదికి మసూచీ సోకింది. (అప్పట్లో అది క_ రోనా కంటే డేంజర్ – వైద్య పరిజ్ఞానం ఇంతగా లేదు కాబట్టి) ఈ విషయం తెల్సుకున్న నౌక కెప్టెన్ మసూచీ సోకిన వ్యక్తితో పాటు అతనికి క్లోజ్ గా ఉన్న మరో ఇద్దర్ని కాల్చి హిందూ మహా సముద్రంలో పడేయించాడు.
మిగితా ఖైదీలంతా కెప్టెన్ చేసిన పనిని ఖండిస్తూ అక్కడే చిన్నపాటి ఉద్యమాన్ని లేవదీసినప్పటికీ….అధికారబలం కింద ఆ ఉద్యమం అక్కడే అణగదొక్కబడింది. ఇలాంటి ఎన్నో నౌకల్లో ఖైదీల పేరుతో స్వాతంత్రం కోసం పోరాడిన మనవాళ్లను అండమాన్ కు పంపించి అరాచక శిక్షలు విధించేవారు బ్రిటీషర్లు.