టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరని అడిగితే ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు యాంకర్ సుమ. సినిమా ఫంక్షన్ అయినా టీవీ షో అయినా యాంకర్ సుమ ఉందంటే సక్సెస్ అవ్వాల్సిందే. అత్యధిక ఎపిసోడ్ లు షోలు చేసి తెలుగులో సుమ రికార్డులు క్రియేట్ చేసింది. గలగలా మాట్లాడుతూ పంచ్ ల వర్షం కురిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
కొంతమంది యాంకర్స్ ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా యాంకరింగ్ కు గ్లామర్ షో అవసరం లేదని సుమ ప్రూవ్ చేసింది. ఒకప్పటి నుండి ఇప్పటి వరకూ నంబర్ 1 యాంకర్ గా సుమ రానిస్తోంది. నిజానికి హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సుమ ఆ తరవాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆలీతో జాలీగా టాక్ షోలో యాంకర్ సుమ సందడి చేసింది.
Advertisement
అంతే కాకుండా టాక్ షో లో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. సుమ మాట్లాడుతూ…..నేను మలయాళి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ప్రేమించారంటూ ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా తాను యాంకరింగ్ నుండి బ్రేక్ తీసుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే గతంలో సుమ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు.
ఇదిలా ఉంటే సుమ ఇటీవల నటిగా జయమ్మపంచాయితీ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించకపోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు సుమ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి పూర్తిగా సినిమాలలో నటించాలని భావిస్తునట్టుగా టాక్. అందుకే యాంకరింగ్ కు బ్రేక్ ఇస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ALSO READ : రేటు పెంచేసిన ధమాకా బ్యూటీ…! ఒక్క సినిమాకే అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా..?