Home » పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న సుధీర్…వ‌ధువు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న సుధీర్…వ‌ధువు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

జ‌బ‌ర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుధీర్ కూడా ఒక‌రు. యాంక‌ర్ గా క‌మెడియ‌న్ గా మ‌రోవైపు హీరోగా సుధీర్ రానిస్తున్నాడు. మొద‌ట జ‌బ‌ర్ద‌స్త్ లో క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇచ్చి త‌న స్కిట్స్ తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఆ త‌ర‌వాత టీం లీడ‌ర్ వ‌ర‌కూ ఎదిగాడు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత సుధీర్ ప‌లు టీవీ షో ల‌లో యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. యాంక‌ర్ గా కూడా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అదే విధంగా ఆ త‌ర‌వాత హీరోగానూ ట్రై చేశాడు. హీరోగా కూడా సుధీర్ సినిమాకు క‌లెక్ష‌న్స్ రావ‌డం విశేషం.

Advertisement

ఇదిలా ఉంటే ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ పెళ్లి వార్త‌లు చాలా సార్లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. యాంక‌ర్ ర‌ష్మితో సుధీర్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని కూడా గ‌తంలో వార్త‌లు వినిపించాయి. కానీ ఆ త‌ర‌వాత అవి ఫేక్ వార్త‌లు అంటూ సుధీర్ ర‌ష్మి క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా మరోసారి సుధీర్ పెళ్లి వార్త‌లు గుప్పుమంటున్నాయి.

Advertisement

sudheer

sudheer

సుధీర్ పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతుంద‌ని స‌మాచారం. అంతే కాకుండా బంధువుల అమ్మాయి వ‌ర‌స‌కు మ‌ర‌ద‌లు అయిన యువ‌తినే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే మాట ముచ్చ‌ట కూడా అయ్యాయ‌ని త్వ‌ర‌లోనే వీరి పెళ్లి పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక ఇప్ప‌టికే సుధీర్ వ‌య‌సు ముప్పై ఏళ్లు దాటిపోయిన సంగ‌తి తెలిసిందే. దాంతో సుధీర్ పెళ్లి ఎప్పుడు అంటూ టీవీ షో ల‌లో కూడా ఆయ‌న పై జోకులు వేశారు. ఎట్ట‌కేల‌కు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వారి నోళ్లు మూయించబోతున్నాడ‌ట‌.

ALSO READ :“విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Visitors Are Also Reading