Home » యాంకర్ శివ‌జ్యోతి నెల‌కు అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తుందా..? ఒక్క యూట్యూబ్ ద్వారానే ఎంత ఇన్ కమ్ వ‌స్తుందంటే..!

యాంకర్ శివ‌జ్యోతి నెల‌కు అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తుందా..? ఒక్క యూట్యూబ్ ద్వారానే ఎంత ఇన్ కమ్ వ‌స్తుందంటే..!

by AJAY
Ad

మీడియాలో వీ6 లో వ‌చ్చే తీన్మార్ వార్తలు స‌రికొత్త ట్రెంట్ ను సృష్టించాల‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలంగాణ యాసలో కామెడీని జోడించి వ్యంగ్యంగా చెబుతూ తీన్మార్ వార్తలు సక్సెస్ అయ్యింది. ఈ షో ద్వారా ప‌రిచ‌య‌మైన వారంద‌రూ ఆ త‌వ‌రాత ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. మొదట తీన్మార్ మల్లన్న గా గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ద్వారా ఓ మీడియాను నడిపిస్తున్నాడు.

అంతేకాకుండా తీన్మార్ వార్తల ద్వారానే పరిచయమైన శివ జ్యోతి అలియాస్ సావిత్రి కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా బిత్తిరి సత్తి త‌న‌దైన స్టైల్ లో వార్తలను ప్రజెంట్ చేస్తూ ప్రస్తుతం సినిమాలు టీవీ షోలు ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్నాడు. ఇక శివ జ్యోతి సైతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివ జ్యోతి ఆ తర్వాత అంత‌క‌ముందు ఆ త‌ర‌వాత అన్న రేంజ్ లో పూర్తిగా మారిపోయింది. ప్ర‌స్తుతం శివ‌జ్యోతి టీవీ షోలు ఇతర ఈవెంట్ ల‌తో ఫుల్ బిజీగా మారింది.

Advertisement

Advertisement

shivajyoti

shivajyoti

మీడియాతో పాటు టీవీ చానల్స్ లో నటిస్తూనే యూట్యూబ్ ద్వారా కూడా అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. కాగా యూట్యూబ్ లో తనకు సంబంధించిన వీడియోలు చేస్తున్న‌ శివ జ్యోతి లగ్జరీ లైఫ్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే శివ జ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో తన కొత్త ఇంటి వీడియోను పోస్ట్ చేయగా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా గతంలో ఒక కారు కొన్న‌ వీడియోను పోస్ట్ చేసిన శివ జ్యోతి రీసెంట్ గా మరో కొత్త కారు వీడియోను షేర్ చేసింది.

దాంతో శివ జ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుంది..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక‌ శివ జ్యోతి నెల సంపాదన ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివ జ్యోతి ప్రస్తుతం ఓ ప్రముఖ ఛాన‌ల్ లో పనిచేస్తుంది. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ లో శివజ్యోతికి 7 లక్షలకు పైగా సబ్ స్క్రైబ‌ర్ లు ఉన్నారు. దాంతో శివ జ్యోతి నెల‌కు ఎనిమిది లక్షల వరకు సంపాదిస్తున్నట్టు సమాచారం.

Visitors Are Also Reading