బిగ్ బాస్ ప్రతిసీజన్ లోనూ సిగరెట్లు తాగే బ్యాచ్ ఉంటుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఎవరెవరికి సిగరెట్ల అలావాటు ఉంది అని నోట్ చేసుకుని మరీ బిగ్ బాస్ సిగరెట్లు సప్లై చేస్తాడు. అయితే కంటెంట్ కోసం సిగరెట్లు ఒకరికి పంపి మరొకరికి పంపకుండా పుల్లలు కూడా పెడుతుంటారు. ప్రతి సీజన్ లో ఇలాగే జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 1లో కోపదాటి మనిషి శివబాలజీ సిగరెట్ల కోసం బిగ్ బాస్ పైకి రెచ్చిపోయాడు.
ఇక రీసెంట్ గా షురూ అయిన బిగ్ బాస్ ఓటీటీలోనూ సిగరెట్ బ్యాచ్ పెద్దగానే ఉంది. ఆ బ్యాచ్ లో యాంకర్ శివ కూడా ఉన్నాడు. ఇటీవలే తనకు బిగ్ బాస్ సిగరెట్ లు పంపలేదని ముమైత్ ఖాన్ ఏడ్చినంత పనిచేసింది. దయచేసి సిగరెట్ పంపండి బిగ్ బాస్ అంటూ వేడుకుంది.
Advertisement
Advertisement
ఇక తాజాగా యాంకర్ శివ తనకు సిగరెట్ లు పంపలేదని బిగ్ బాస్ కెమెరా వైపు చూస్తూ బూతులు మాట్లాడాడు. రేపు నాకు సిగరెట్లను పంపంది..నా మొకం పై దెం అంటూ యాంకర్ శివ బిగ్ బాస్ పై రెచ్చిపోయాడు. సిగరెట్ లు పంపడం ఇష్టం లేకపోతే వదిలేయండి.
ALSO READ : RADHESHYAM REVIEW : ప్రభాస్ “రాధేశ్యామ్” రివ్యూ అండ్ రేటింగ్….!
ముందు ఎవరికి సిగరెట్ కావాలంటూ ఎందుకు పేర్లను తీసుకున్నారు. తరవాత ఎందుకు సిగరెట్లు పంపించడం లేదు. ఒకరికి సిగరెట్లు పంపించి మరొకరికి పంపకపోవడం ఏంటి. నాలుగు రోజుల నుండి నాకు సిగరెట్లు కావాలని చెబుతున్నా….పంపిస్తే పంపండి లేదంటే లేదని చెప్పిండి అంటూ యాంకర్ శివ బిగ్ బాస్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.