Home » Anchor Shilpa: అప్పట్లో బుల్లితెరపై సత్తా చాటిన ఈ స్టార్ యాంకర్ మరీ ఇలా మారిందేంటి..?

Anchor Shilpa: అప్పట్లో బుల్లితెరపై సత్తా చాటిన ఈ స్టార్ యాంకర్ మరీ ఇలా మారిందేంటి..?

by Sravanthi
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని బుల్లితెరపై తన యాంకరింగ్ తో అంద చెందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది శిల్ప చక్రవర్తి. హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మడు తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరిస్తూ వస్తోంది. పలు టీవీ షోలకు హోస్టుగా వ్యవహరించేది. అప్పట్లో యాంకరింగే కాకుండా నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో కూడా కనిపించి తనలోని నటనా టాలెంట్ ను బయట పట్టింది. తెలుగులో చాలా క్లారిటీగా మాట్లాడే శిల్పాది బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. తన తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపరాల్సి వచ్చింది.

Advertisement

 

 

మొదట మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత బుల్లితెర వైపు మొగ్గు చూపింది. వావ్ ది అల్టిమేట్ గేమ్ షో అనే బుల్లితెర యాంకర్ గా పరిచయమైంది. దీని తర్వాత కంటే కూతుర్నే కనాలి సీరియల్లో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. దీని తర్వాత డాన్స్ బేబీ డాన్స్, భలే జోడి వంటి టాప్ టీవీ షోలకు హోస్ట్ గా చేసింది. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు సాధించింది. ఇక యాంకర్ గా నటిగా చాలా బిజీగా ఉన్న టైంలోనే శిల్పా కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.

Advertisement

ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి వారి బాధ్యతలను చూసుకుంటూ తన సినీ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే 2019 బిగ్ బాస్ మూడో సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చిన ఆమె సరిగ్గా రెండు వారాల తర్వాత ఎలిమినేట్ అయిపోయింది. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫ్యామిలీ ఫోటోలను ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటుంది. అవి చూసినటువంటి నెటిజన్లు ఆమె అందం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని కామెంట్లు పెడుతుంటారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading