బిగ్ బ్యూటీ భాను శ్రీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భాను శ్రీ మొదట సీరిలయల్స్ నటించింది. అంతకముందు హీరోయిన్ లకు సైడ్ డ్యాన్సర్ గా డ్యాన్స్ చేసేది. చాలా తక్కువ స్థాయిలో కెరీర్ ను ప్రారంభించిన భానుశ్రీ ప్రస్తుతం యాంకర్ గా నటిగా బిజీ అయ్యింది. ఇక సీరియల్స్ మరియు యాంకర్ గా కంటే బిగ్ బాస్ ద్వారా భానుశ్రీ ఎక్కువ గుర్తింపును సాధించుకుంది.
Advertisement
బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన భాను శ్రీకి కౌషల్ తో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవతో భానుశ్రీ ఎక్కువ వైరల్ అయ్యింది. అంతే కాకుండా బిగ్ బాస్ లో తన యాటిట్యూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా తక్కవ కాలంలోనే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత యాంకర్ గా చాలా బిజీ అయ్యింది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తూ కూడా బిజీగా ఉంది.
Advertisement
అడపాదడపా సినిమాలు సైతం చేస్తూ టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. ఇక భాను శ్రీ ఇప్పుడు తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో తనకు ఓ వ్యక్తి ఎంతో సాయం చేశాడని తెలిపింది. ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న తనకు అతడు ఎంతో అండగా నిలిచాడని చెప్పింది.
ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అతడేనని చెప్పింది. తన స్నేహితుడిని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. ఇక ఇప్పుడు భాను శ్రీ అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే భానుశ్రీ నోరు విప్పాల్సిందే.