అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి మెత్తగా పరిచయం అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు సినిమాల్లో విపరీతమైన ఛాన్సులు అందుకుంటుంది ఈ బ్యూటీ. అనసూయ ఏం చేసినా ఓ సెన్సేషన్ గా మారుతుంది. తాను సినిమాల్లో ఓకే చెప్పిందంటే చాలు ఆ పాత్రకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అంటున్నారు అనసూయ ఫ్యాన్స్. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను తన వైపుకు తిప్పుకుంటుంది. అనసూయ అదే రేంజ్ లో సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక కొంతమంది అనసూయపై చాలా నెగటివ్ గా కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ వాటిని అనసూయ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ట్రోలర్స్ గురించి మాట్లాడుతూ…. నేను ట్రోలర్స్ ని అస్సలు పట్టించుకోను. వారిని పట్టించుకోని నా సమయాన్ని వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. అలాంటివారు వింత జంతువులతో సమానం. అలాంటి విషయాలను మాట్లాడడం కన్నా మన పని మనం చేసుకుంటూ పోవడం చాలా మంచిది. వారిని పట్టించుకుంటూపోతే మన సమయం వృధా అవుతుంది. నేను వాటిని అస్సలు పట్టించుకోనంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Advertisement
తన పూర్తి దృష్టి అంతా సినిమాల పైనే ఉందని… కొత్త కొత్త ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటున్నానంటూ చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తాను ఇంట్లో ఎప్పుడు తన కుటుంబసభ్యులతో ఇంగ్లీష్, హిందీలోనే ఎక్కువగా మాట్లాడటం వల్ల బయట కూడా తనకు అదే అలవాటైపోయిందని, తన చదువు అంతా ఇంగ్లీష్ మీడియంలోనే సాగిందని, తనకు తెలుగు కూడా చాలా బాగా వచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అనసూయ చేయబోయే దాక్షాయిని పాత్రకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వనుంది. పుష్ప-2 సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి