Home » అనంత్-రాధిక పెళ్లిసందడి.. లేజర్ లైట్ షో వైరల్..!

అనంత్-రాధిక పెళ్లిసందడి.. లేజర్ లైట్ షో వైరల్..!

by Anji
Ad

రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త రాధిక మర్చంట్ పెళ్లికి సంబంధించి రోజుకో ముచ్చట వైరల్ అవుతోంది. తాజాగా గుజరాత్ లోని లేజర్ లైట్ షో వైరల్ అవుతోంది. అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధిక మర్చంట్ తో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్, బిజినెస్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement

జులై 12న వీరి పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు ముమ్మరం చేసాయి. స్టార్, స్టడెడ్ ఈవెంట్ కి ముందు మార్చి 1-ఏప్రిల్ 2024 ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నాహాలు ఊపు అందుకున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముందు అంబానీ కుటుంబం లేజర్ లైట్ షో  ని ఏర్పాటు చేసిందట. శ్రీ కృష్ణుడి థీమ్ తో జామ్ నగర్ లో అందమైన లేజర్ లైట్ షో  విజువల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తల్లి, కొడుకుల మధ్య అందమైన బంధాన్ని పచ్చదనంతో తిరుగుతున్న ఏనుగును, నీలి ఆకుపచ్చ రంగులలో జామ్ నగర్ మ్యాప్ లు చూపించే దృశ్యాలు విశేషంగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. వివాహానికి ముందు గుజరాత్ లోని జామ్ నగర్ లో 14 కొత్త ఆలయాలను ప్రారంభించనున్నారు.

Advertisement

అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముఖేష్ అంబానీ అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారట. ఖతర్ ప్రధానమంత్రి, బూటాన్ రాజు, రాణి సాహా మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, బ్లాక్ రాక్ సీఈవో లారీ పింక్, బ్లాక్ స్టోన్ చైర్మన్ తదితర ప్రముఖులున్నారు. అతిథులకు మూడు రోజుల పాటు డిపరెంట్  డ్రెస్ కోడ్ ఉంటుంది.  దీంతో అతిథులకు అద్భుతమైన బహుమతులు కూడా ఇవ్వబోతున్నారట.

Also Read : ధృవ్ జురెల్ మిలిటరీ సెల్యూట్ వెనుక దాగి ఉన్న స్టోరీ మీకు తెలుసా?

Visitors Are Also Reading