Home » ఆ జీప్ నాకు ఇవ్వు నీకు బొలెరో ఇస్తా… ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..!

ఆ జీప్ నాకు ఇవ్వు నీకు బొలెరో ఇస్తా… ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..!

by AJAY
Ad

కొడుకు కోరికను తీర్చేందుకు ఓ వ్యక్తి పాత ఇనుము మరియు ఇంజన్ తో చిన్న కమాండర్ జీపు ను తయారు చేశాడు. అయితే ఈ జీప్ కు సంబంధించిన వీడియో కాస్తా ఆనంద్ మహీంద్రా వద్దకు చేరింది. దాంతో ఆయన జీప్ తయారు చేసిన యజమానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సరికొత్త బొలెరో వాహనాన్ని ఇస్తానని ఆ జీపును తనకు ఇవ్వాలని కోరాడు. దాంతో ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ జీప్ ను ఎవరు తయారు చేసరు….ఎలా తయారు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం… మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కడేగావ్ కు చెందిన దత్తాత్రేయ కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Anand Mahindra offers bolero

Anand Mahindra offers bolero

అయితే ఒకరోజు దత్తాత్రేయ కుమారుడు తన తండ్రిని కారు కొని ఇవ్వాలని కోరాడు. దాంతో తన కుమారుడి కోరిక ఎలాగైనా తీర్చాలని దత్తాత్రేయ తక్కువ ఖర్చుతో… పాత సామాన్లతో వచ్చిన జీపును తయారు చేశాడు. ఈ జీపు కమాండో జీపును పోలి ఉంది. అంతే కాకుండా ఈ జీపు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని దత్తాత్రేయ చెబుతున్నాడు. ఇక ఈ జీప్ కు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ లో షేర్ చేశారు.

Advertisement

Advertisement

 

తన ట్వీట్ లో ఆనంద్ మహీంద్రా “నిబంధనలకు అనుగుణంగా ఈ వాహనం లేదు కాబట్టి స్థానిక అధికారులు ఇప్పుడో లేదా తర్వాతనో దీనిని నిలిపివేస్తారు. నేను వ్యక్తిగతంగా అడుగుతున్నాను. అతడు తన కారును నాకు ఇస్తే అతడికి బొలెరో వాహనాన్ని ఇస్తాను. ఆ జీపును మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శిస్తాను. అది మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. సమృద్ధి వనరులు అంటే అర్థం తక్కువ వనరులతో ఎక్కువ ఆవిష్కరణ చేయడం” అంటూ పేర్కొన్నారు. దాంతో కుటుంబం కోసం దత్తాత్రేయ పడిన కష్టం…ఆయన చేసిన కృషి వల్లే ఆనంద్ మహీంద్రా చేత ప్రశంశలు అందేలా చేశాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading