కొరియోగ్రాఫర్ గా ఓంకార్ ఛాలెంజ్ షో జడ్జ్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మనకు సుపరిచితమైన వ్యక్తి అమ్మ రాజశేఖర్. ఈయన తన కెరీర్ ను డాన్స్ మాస్టర్ గా స్టార్ట్ చేసి డైరెక్టర్ గా టర్న్అప్ అయ్యాడు. మొత్తంగా 6 సినిమాలను తీస్తే అందులో మొదటి సినిమా మినహా అన్నీ ప్లాప్ లే! ఆయన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
1) రణం – బ్లాక్ బస్టర్:
గోపిచంద్ , కామ్నాజఠ్మలానీ హీరోహీరోయిన్లుగా అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో 2006లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో అమ్మ రాజశేఖర్ కు మంచి డైరెక్షన్ ఆఫర్స్ వచ్చాయి.
Advertisement
2) ఖతర్నాక్ -ఫ్లాప్ :
రణం జోష్ తో అదే జానర్ లో అమ్మ రాజశేఖర్ తీసిన మరో చిత్రం ఖతర్నాక్ . రవితేజ, ఇలియానా హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
3) టక్కరి -ఫ్లాప్:
సక్సెస్ ఫుల్ జంటగా పేరుపొందిన నితిన్ సదాలను హీరోహారోయిన్లుగా పెట్టి అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 3వ చిత్రం టక్కరి… ఈ సినిమా రిజల్ట్ కూడా ఫ్లాప్.
Advertisement
4) బీభత్సం- యావరేజ్ :
ఖతర్నాక్, టక్కరి ఫ్లాప్ ల తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని 2009లో శశాంక్, మధుశర్మలను లీడ్ రోల్స్ లో పెట్టి అమ్మ రాజశేఖర్ తీసిన 4వ చిత్రం బీభత్సం. కథ, కథనం బాగున్నప్పటికీ ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.
5) మ్యాంగో- ఫ్లాప్:
బీభత్సం తర్వాత 4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి 2013లో కృష్ణుడు హీరోగా అమ్మ తీసిన 5వ చిత్రం మ్యాంగో ఇది అట్టర్ ప్లాప్
6) రణం-2- ఫ్లాప్:
రణంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ రణం-2 తర్వాత డైరెక్షన్ కు దూరమయ్యారు. రణం హిట్ అవ్వడంతో అదే టైటిల్ తో రణం2 చేశారు. కానీ రణం హీరో గోపిచంద్ ను కాదని తనే హీరోగా చేశాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా ప్లాప్.