కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొన్న విశాఖ లో పర్యటించిన హోంశాఖ మంత్రి అమిత్ షా… జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు తెలంగాణపై ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే…రేపు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్నారు అమిత్ షా.
Advertisement
ఇక ఎల్లుండి ఉదయం దర్శకుడు రాజమౌళి నివాసానికు వెళ్లనున్నారు అమిత్ షా. రాజమౌళి నివాసంలో 11.45 నుంచి 12.15 వరకు ఉండనున్న అమిత్ షా…12.45 నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం భద్రాచలం కు అమిత్ షా వెళ్లనున్నారు. 4 నుంచి 4.40 వరకు భద్రాచలం శ్రీరాముల వారి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుండి ఖమ్మం కి అమిత్ షా వెళ్తారు. ఇక ఎల్లుండి సాయంత్రం 5.40- 5.55 వరకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు, 6-7 గంటల వరకు ఖమ్మం లో బహిరంగ సభ లో పాల్గొంటారు అమిత్ షా.
Advertisement
అలాగే, 7.10 నుంచి 7.40 వరకు ఖమ్మం గెస్ట్ హౌస్ సమావేశంలో అవుతారు అమిత్ షా. రాత్రి 7.40కి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లనున్న అమిత్ షా…విజయవాడ నుంచి గుజరాత్ వెళ్లనున్నారు. అయితే… దర్శకుడు జక్కన్నను ఈ సందర్భంగా అమిత్ షా బిజెపిలోకి ఆహ్వానించనున్నారని సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనిపై కొంతమంది వ్యక్తులతో రాజమౌళి తో బిజెపి అధిష్టానం చర్చించిందట. ఇందులో భాగంగానే ఎల్లుండి రాజమౌళితో అమిత్ షా భేటీ కానున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.