నిన్న ఆస్ట్రేలియా న్యూజిల్యాండ్ మద్య జరిగిన టిట్వంటీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిల్యాండ్ పై గెలిచిన విషయం తెల్సిందే…. కానీ ఇండియన్ క్రికెటర్ అమిత్ మిశ్రా తన ట్విట్టర్ లో T20 వరల్డ్ కప్ గెలిచిన న్యూజిల్యాండ్ కు కంగ్రాట్స్…గ్రేట్ టీమ్ ఎఫర్ట్ , వెల్ ప్లేయ్డ్ అంటూ రాత్రి 12 గంటలకు ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి: కోహ్లీది ఈ రేంజ్ బ్యాడ్ లక్ ఆ…?
Advertisement
— Harsh (@Harsh35356913) November 14, 2021
Advertisement
ఒక్కసారిగా ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై ట్విట్టర్ యూజర్లు తమదైన స్టైల్లో ట్రోల్ చేసి పడేశారు. తాగి మత్తులో ట్వీట్ చేశాడేమో అని కొందరు, నిద్రలో ఉన్నావా? అని మరికొందరు, ఇదే నిజమైతే బాగుండని ఇంకొందరు ట్వీట్స్ చేశారు. తన తప్పు తెల్సుకున్న మిశ్రా 12:30 కి T20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు కంగ్రాట్స్ అంటూ తన ట్వీట్ ను సవరించుకున్నాడు. కానీ ఆ 20 నిమిషాల్లోపే ట్వీట్ వైరల్ అవ్వడం. మిశ్రాను ఓ ఆట ఆడుకోవడం జరిగిపోయాయి!
ఇవి కూడా చదవండి: క్రికెట్ లో సిక్స్ తో పాటు 8 ఉంటే ! గంభీర్ చెప్పిన రూల్ ఫాలో చేస్తే?