గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఫామ్ కనబరిచింది. చివర్లో కాస్త తడబడింది. సంజూ శాంసన్ సారథ్యంలోని ఆ జట్టు ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలుచుకోవాలనే ఆశతో ఎదురుచూస్తుంది. అందుకు తగ్గట్టే.. దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఆ జట్టు. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 200 కి పైగా పరుగులు చేసినప్పటికీ పింక్ ఆర్మీ పరాజయం పాలైంది. గతి తప్పిన బౌలింగ్ కి తోడు.. టిమ్ డేవిడ్ విశ్వరూపంతో రాజస్థాన్ కి మరో విజయం దూరమైంది.
Also Read : Chikoti Praveen: థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
Advertisement
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కి చెందిన ఓ ఆటగాడు మాత్రం హైలెట్ అయ్యాడు. అతనే స్టార్ పేసర్ సందీప్ శర్మ. 213 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ (55 : 28 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. మిస్టర్ 360 వేగంగా ఆడే ప్రయత్నంలో ఉండగా.. 15.3 ఓవర్ వద్ద బౌల్ట్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించాడు. బంతి చాలా సేపు గాల్లోకి లేచింది. సందీప్ శర్మ ఏకంగా 19 మీటర్లు ముందుకు పరిగెత్తి గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్ ను అందుకున్నారు. దీనిని ఏ మాత్రం ఊహించలేదు సూర్య. దీంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. సందీప్ శర్మ క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
𝙏𝙞𝙢𝙚𝙡𝙮 𝙗𝙧𝙚𝙖𝙠𝙩𝙝𝙧𝙤𝙪𝙜𝙝 🔥
📹 how Ravi Bishnoi outfoxes Virat Kohli with a googly! 🥵#LSGvRCB #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @LucknowIPL pic.twitter.com/G3qNqGqoYz
— JioCinema (@JioCinema) May 1, 2023
సందీప్ క్యాచ్ చూడగానే 1983 వరల్డ్ కప్ ఫైనల్ లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గుర్తుకొస్తుందంటూ.. నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 1983 ప్రపంచకప్ లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండిస్ బ్యాటర్ వివిఎన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని కూడా ఇదేవిధంగా పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ యశస్వి జైస్వాల్ (124) అద్భుతమైన సెంచరీ ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చూసి ముంబై ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయమనిపించింది. కానీ కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్ లు విధ్వంసకరంగా ఇన్నింగ్స్ ఆ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.