Home » కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!

కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!

by Anji
Ad

సాధారణంగా మనం వంట గదిలో కరివేపాకును విరివిగా వాడుతుంటాం. భారతీయులు అయితే కరివేపాకు లేనిది వంటలను పూర్తి చేయడం చాలా కష్టం అనే చెప్పాలి. కొందరూ కూరలు, టిఫిన్స్ వంటి వాటిలో కరివేపాకును తినకుండా పక్కకు పెడుతుంటారు. కరివేపాకు తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే.. ఎవ్వరూ కూడా అలా చేయరు. కరివేపాకు ఆకులు మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో పేరుకుపోయినటువంటి చెడు కొవ్వును కరిగిస్తాయి. మన కంటికి, గుండెకు కూడా చాలా మంచిది అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కరివేపాకును కూరల్లో తినడం కష్టంగా భావించిన వారు దానిని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని వివరిస్తున్నారు. కరివేపాకు రసం తయారీ విధానం, దానిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  బెల్లం టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తాగకుండా ఉండలేరు..!

Advertisement

తయారీ విధానం :

కరివేపాకు జ్యూస్ తయారు చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. తాజాగా శుభ్రం చేసిన కరివేపాకులను మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. వీలు అయినంత కరివేపాకు ఆకులను మెత్తగా దంచిన పర్వాలేదు. గ్రైండర్ లేదా మిక్సర్ లేని వారు ఒక గిన్నెలో వాటర్ పోసి కరివేపాకులను వేయాలి. గ్యాస్ మీద పెట్టి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆకులు గోధుమ రంగులోకి మారిన తరువాత నీటిని వడపోసి వేరు చేసుకోవాలి. అలా చేస్తే.. మీకు కావాల్సిన కరివేపాకు జ్యూస్ సిద్ధమవుతుంది. 

Advertisement

Also Read :   ఫ్రిజ్ లో ఉంచిన పుచ్చకాయను తింటే ఏమవుతుందో తెలుసా ? 

కరివేపాకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు :

  • కరివేపాకు జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. దీని ద్వారా కడుపులో తిప్పడం, వికారం వంటివి సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
  • కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు వల్ల రక్తం సరఫరా జరగదు. అలాంటప్పుడు కరివేపాకు తింటే.. లేదా జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అవుతుంది.  
  • అతివేగంగా తినేవారికి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు కరివేపాకు తినడం, కరివేపాకు జ్యూస్ తాగితే అజీర్తి సమస్య దూరమవుతుంది. జీర్ణక్రియ సరిగ్గా జరిగి సమయానికి ఆకలి అవుతుంది. 
  • బరువు తగ్గాలనుకుంటే కరివేపాకు జ్యూస్ తగ్గడం వల్ల ప్రయోజనముంటుంది. అందుకు తగిన శారీరక శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది. 
  • మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కరివేపాకు తినడం, జ్యూస్ తాగడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 
  • కరివేపాకు రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం కరివేపాకు రసం తీసుకొని అద్భుతమైన ప్రయోజనాలు పొందండి.

Also Read :  పరగడుపునే నిమ్మరసం తాగితే ఏమవుతుందంటే..?

Visitors Are Also Reading