Home » నేను కూడా రైతుబిడ్డనే… అమర్ ని ట్రోల్ చేయకండి.. అమర్ తల్లి ఎమోషనల్..!

నేను కూడా రైతుబిడ్డనే… అమర్ ని ట్రోల్ చేయకండి.. అమర్ తల్లి ఎమోషనల్..!

by Sravya
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ కి వచ్చిన వాళ్లలో అమర్ దీప్ కూడా ఒకరు. అమర్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు, బుల్లె తెర నటుడుగా పాపులర్ అయ్యారు. అమర్ ఎన్నో సీరియల్స్ తో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చే టాస్కులపై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు క్రమక్రమంగా అమర్ గ్రాఫ్ కిందకి పడిపోతూనే ఉంది. పైగా ఈయన హౌస్ లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడం కూడా ఎవరికీ నచ్చలేదు.

Advertisement

Advertisement

నెగెటివిటీని ఎదుర్కొంటున్నాడు అమర్. ఈయనపై నెగిటివ్ కామెంట్లు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో అమర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ వీడియో ని షేర్ చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఇలాంటివి ఆపేయండి. నా కొడుకు మంచివాడు కాదు అని కామెంట్లు చేయొద్దు చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు. కావాలని కొంతమంది టార్గెట్ చేసి తప్పు కామెంట్లు చేస్తున్నారని.. నేను కూడా ఒక రైతు బిడ్డని. రైతే ఎప్పటికీ రాజు అని అన్నారు. అమర్ తండ్రి కూడా ఒక మెకానిక్. సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళమే అని అమర్ తల్లి ఎమోషనల్ అయ్యారు.

Also read:

Visitors Are Also Reading