టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో అక్కినేని నాగార్జున-అమల ఒకరు. వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో నాగార్జున విడిపోయిన తరువాత 1992లో రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిల్ సంతానం. మొదటి భార్యకి నాగ చైతన్య సంతానం. నాగార్జున అమల చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికొకరూ అన్నట్టు జీవిస్తారు. మూడు దశాబ్దాల కాపురంలో పెద్దగా గొడవపడిన సందర్భాలు లేవు. అమల పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తుంది.
Advertisement
Advertisement
అమల సామాజిక స్పృహ ఉన్న మహిళా.. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే యానిమల్ లవర్. బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ కో ఫౌండర్. మూగజీవాల రక్షణకు కృషి చేస్తున్నారు. నాగార్జునతో ఒక విషయంలో అమలకు గొడవలు జరుగుతాయట. ఈ విషయాన్ని నేరుగా అమలనే వెల్లడించింది. ఏదైనా ఒక పని మొదలు పెట్టకముందే నేను చేయలేనని.. అమల బాధపడతారట. లేదు నీ వల్ల అవుతుంది చేయగలవు అని నాగార్జున అంటారట. అప్పుడు వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుందట. ఎలాంటి గొడవనైనా సాయంత్రానికి సెటిల్ చేసుకుంటారట.
నాగార్జున తనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడట. ఏది అడిగినా కాదని అనడట. అమల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 1993లో విడుదలైన ఆగ్రహం హీరోయిన్ గా అమలకు చివరి చిత్రం. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఒకే ఒక జీవితం, మనం, తుమ్ సే నా హో పాయెగా వంటి సినిమాల్లో అమల నటించింది. నాగార్జున తాజాగా నా సామిరంగ చిత్రంతో హిట్ కొట్టాడు.
Also Read : ఉత్తమ నటి అవార్డు విషయంలో భానుమతి, సావిత్రి మధ్య వివాదం అంతలా తలెత్తిందా ?