టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ పైబడినప్పటికీ స్టార్ హీరోలకు పోటీగా అక్కినేని నాగార్జున సినిమాలు చేస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అక్కినేని నాగార్జున… ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా తన కొడుకులకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు అక్కినేని నాగార్జున.
Advertisement
అలాగే అటు బిజినెస్ లు కూడా రన్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలోనే బిగ్ బాస్ 7 సీజన్ ను ప్రారంభించేశాడు అక్కినేని నాగార్జున.
ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున గురించి ఓ ఆసక్తికర విషయం తాజాగా ఆయన భార్య అమల వెల్లడించింది. నాచురల్ స్టార్ నాని మరియు అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో దేవదాసు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున డాన్ గా.. ఎప్పుడు మందు తాగుతూ కనిపిస్తాడు.
Advertisement
అయితే ఈ సినిమా గురించి అక్కినేని అమల షాకింగ్ నిజాలు బయటపెట్టింది. ఈ సినిమాలో తన పాత్ర పండేందుకు… నిత్యం మద్యం సేవించేవాడని అక్కినేని నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇంట్లో తాగి.. షూటింగ్ కు వెళ్లేవాడని తెలిపింది. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే పనిగా నాగార్జున తాగాడని వెల్లడించింది అమల. దీంతో నాగార్జునకు వార్నింగ్ కూడా ఇచ్చిందట.
అయినప్పటికీ నాగార్జున తాగడం మానేయలేదట. ఈ నేపథ్యంలోనే నాగర్జున పై అలక బూనిందట అమల. అమల అలగడంతో నాగార్జున మద్యం తాగడం మానేశాడట. ఈ విషయాలను తాజాగా అమల ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
- Lavanya Tripathi : పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం !
- బేబీ మూవీలో పెళ్లికొడుకు.. యాంకర్ విష్ణుప్రియకు ఉన్న సంబంధం ఇదే ?
- Jawaan : భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార..ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ ?