టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుసగా హీరోలు వివాహం చేసుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరోస్ గా ఉన్న ప్రతి ఒక్క హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ పెళ్లి పీటలు ఎక్కి ఓ ఇంటివారు అవుతున్నారు. ఇక వివాహ అనంతరం సినిమాల్లో మళ్ళీ ఎప్పటిలానే నటిస్తూ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు సినిమాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారట.
ఇక ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అయినటువంటి అల్లు శిరీష్ మాత్రం పెళ్లి పీటలు ఎక్కడం లేదు. వయసు పెరిగినప్పటికీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తను వివాహానికి సిద్ధమైనట్లు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ అందులో ఇంతవరకు ఏది జరగలేదు. అయితే అల్లు శిరీష్ వివాహం ఎందుకు చేయట్లేదు అని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అల్లు శిరీష్ వివాహం చేసుకో పోవడానికి ఓ బలమైన కారణం ఉందట. తాను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట.
Advertisement
Advertisement
ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో వివాహానికి అంగీకరించలేదట. దీంతో కోపంతో అల్లు శిరీష్ చేసుకుంటే ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని లేకపోతే అసలు వివాహం చేసుకోనని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారట. ఇక కుటుంబ సభ్యులు ఎంత మంచి సంబంధాలు తెచ్చినప్పటికీ వాటికి ఒప్పుకోవడం లేదట. ఈ కారణం వల్లనే అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టడం లేదు. ఇక అల్లు శిరీష్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? లేదా కుటుంబ సభ్యులు చెప్పిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడా? అనేది ఈ వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి
- లావణ్య త్రిపాఠి కోసం మెగా హీరోలు భారీ త్యాగం… చిరంజీవి కూడా ?
- Shubman Gill : హాస్పిటల్లో చేరిన శుభ్మన్ గిల్.. పాకిస్థాన్ మ్యాచ్కు కూడా డౌటే
- జార్వో 69కి షాకిచ్చిన ICC… వరల్డ్ కప్ మ్యాచ్లు చూడకుండా శిక్ష..!