Home » ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న అల్లు అర్జున్.. ఆ సినిమా ఏదంటే..?

ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న అల్లు అర్జున్.. ఆ సినిమా ఏదంటే..?

by Anji
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఉదయ్ కిరణ్. తొలి మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఉదయ్ కిరణ్. అదే క్రేజ్ తోనే తేజతో కలిసి మరో సినిమా చేశాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమానే నువ్వునేను. టాలీవుడ్ హిస్టరీలోనే సంచలన విజయాన్ని సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

Advertisement

అప్పట్లో ఉదయ్ కిరణ్ నటించిన  మనసంతా నువ్వే మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ కి ఆ తరువాత ఆఫర్స్ మెల్ల మెల్లగా తగ్గాయి. చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్స్ రావడం మొదలయ్యాయి. ఆ తరువాత కెరీర్ సరిగ్గా మలుచుకోలేకపోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  ఈ విషయాన్ని పక్కకు పెడితే.. వాస్తవానికి ఉదయ్ కిరన్ నటించిన నువ్వు-నేను మూవీ తొలుత అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారట. అదే విషయాన్ని తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. చిత్రం సినిమా సూపర్ హిట్ సాధించిన తరువాత నువ్వు-నేను కథను రాసుకున్నాను.

Advertisement

 

అప్పుడే అల్లు అర్జున్ ని చూశాను. నా కథకు సరిగ్గా సరిపోతాడు అనుకున్నాను. నా కథలో హీరో ఎలా ఉండాలో అల్లు అర్జున్ అలా ఉన్నాడు అనిపించిందని తేజ చెప్పారు. కానీ అదే విషయాన్ని అల్లు అరవింద్ గారికి చెప్పగా.. బన్నీ అప్పుడే మల్టీ మీడియా కోర్సు నేర్చుకుంటున్నాడు అని చెప్పాడట. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సమయం ఉందని తెలపడంతో.. దీంతో తొలి సినిమాను ఉదయ్ కిరణ్ తోనే సినిమా చేశానని తెలిపాడు తేజ. ఆ తరువాత అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నాడు.

Also Read :  మహేష్ బాబు చేయాల్సిన హిట్ మూవీ తరుణ్ దగ్గరికీ ఎలా వెళ్లిందో తెలుసా ?

Visitors Are Also Reading