Home » “పుష్ప” నటుడుకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్… అదే జరిగితే చంపేస్తాను..!

“పుష్ప” నటుడుకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్… అదే జరిగితే చంపేస్తాను..!

by AJAY
Ad

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా… డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా… టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీలో సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు స్నేహితుడు పాత్రలో జగదీష్ ప్రతాప్ బండారి నటించాడు. ఈయన ఈ సినిమాలో కేశవ అనే పాత్రలో నటించి అల్లు అర్జున్ కి అత్యంత ఆప్తుడిగా కనిపించి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు. ఈ మూవీ ద్వారా ఈ నటుడుకి అద్భుతమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం బన్నీ పుష్ప ది రూల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ పుష్ప ది రైస్ మూవీకి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బన్నీ ఇండియన్ ఐడల్ 2 ఫైనల్ కు ముఖ్యఅతిథిగా విచ్చేశాడు. తాజాగా జగదీష్ “సత్తి గాని రెండెకరాలు” అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఈ నటుడు కూడా ఈ షోకు విచ్చేశాడు. అందులో భాగంగా బన్నీకి జగదీష్ కు మధ్య ఫన్నీ సంభాషణ కొనసాగింది.

ఈ సంభాషణలో భాగంగా బన్నీ సినిమాలో హీరోగా నటించావు. సినిమా మంచి సక్సెస్ అయినట్లు అయితే నా సినిమా షూటింగ్ కు రావా… నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సినిమా మంచి సక్సెస్ అయ్యి నువ్వు గనక నా సినిమా షూటింగ్ కు రాకపోతే నేను చంపేస్తాను అంటూ బన్నీ… జగదీష్ తో ఫన్నీగా మాట్లాడాడు. ప్రస్తుతం బన్నీ… జగదీష్ ల మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading