Home » “పుష్ప 2” లో మెగా డాటర్… వార్తల్లో వాస్తవం ఉందా..?

“పుష్ప 2” లో మెగా డాటర్… వార్తల్లో వాస్తవం ఉందా..?

by AJAY
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో మలయాళ విలక్షణ నటుడు ఫాహధ్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా … రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

Advertisement

ఈ సినిమాలో రావు రమేష్, సునీల్, అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా … సమంత ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే పుష్ప మూవీ మొదటి బాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Advertisement

Pushpa 2

కొన్ని రోజుల క్రితమే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి “వేర్ ఇస్ ద పుష్ప” అనే పేరుతో ఒక వీడియోను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీలో మెగా డాటర్ కొణిదల నాగబాబు కూతురు నిహారిక ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది అని … నిహారిక పాత్ర నిడివి ఈ సినిమాలో కాస్త తక్కువే అయినప్పటికీ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో నిహారిక కనిపించబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

niharika konidela

niharika konidela

ఈ వార్త ప్రస్తుతం చాలా వైరల్ అవుతున్నప్పటికీ ఈ మూవీ బృందం మాత్రం ఈ వార్తలను ఖండించలేదు … అలా అని ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. మరి ఈ సినిమాలో నిజంగానే నిహారిక నటిస్తుందా… లేదా తెలియాలి అంటే ఈ చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Visitors Are Also Reading