Home » అల్లు అర్జున్ కి ఇష్టాయిష్టాలు ఉండవా..? ఎన్నాళ్ళు ఇలా..?

అల్లు అర్జున్ కి ఇష్టాయిష్టాలు ఉండవా..? ఎన్నాళ్ళు ఇలా..?

by Sravya
Ad

ఎన్నికల సందర్భంగా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎక్కువగా హింసలు కూడా అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల సమయంలో చేసిన పోస్టు దుమారం రేపింది. ‘మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే’ అంటూ నాగబాబు పోస్ట్ చేస్తారు. నెట్టింట పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. పైగా ప్రతి ఒక్కరు దాని గురించే చర్చించుకున్నారు. తర్వాత దుమారం రేపింది. ఎక్స్ లో నాగబాబు ఎకౌంట్ ని తొలగించేశారు.

Advertisement

ఈ ట్వీట్ మీద మెగాస్టార్ కూడా మండిపడ్డారు. ఆ ట్వీట్ ని తొలగించలేక నాగబాబు ఏకంగా ఎకౌంట్ ని తొలగించేస్తారు అని టాక్ వినపడుతోంది. నాగబాబు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ని ఉద్దేశించి ఆ పోస్టు చేశారని అంతా అంటున్నారు. ఎందుకంటే బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ గా ఉన్నారని అందుకని ఈ మేరకు ట్వీట్ చేశారు. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడికే సపోర్ట్ ఇవ్వకముందే పవన్ కళ్యాణ్ పై ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవకు ఎంతో నిబద్ధతతో పని చేస్తారని కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ సపోర్ట్ ఆయనకి ఎప్పుడూ ఉంటుందని అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు. మీరు కోరుకున్నవన్నీ జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను అని కూడా అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.

Advertisement

ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉన్నారని తెలిపారు అయితే తన స్నేహితుడు రవి కోసం నంద్యాల వెళ్లారు బన్నీ పార్టీలతో నాకు సంబంధం లేదు నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా నేను సపోర్ట్ ఇస్తాను అని బన్నీ పోస్ట్ ఆయన స్నేహితుడికి సపోర్ట్ ఇచ్చారు. నాగబాబు టెన్షన్ పడిపోయి ఓట్లు అన్ని వైసీపీకి ఎక్కడ వెళ్లిపోతాయని ఈ పోస్ట్ చేశారు. అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇంకెన్నాళ్లు మెగా ఫ్యామిలీ తోక పట్టుకుని బన్నీ తిరగాలని ఆయనకంటూ ఇష్ట ఇష్టాలు ఉండవా అని ఆయనను సపోర్ట్ చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading