అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఎపిసోడ్ ఇటీవలే ప్రసారం అయింది. అల్లు అర్జున్ సినిమాలకి సంబంధించి విషయాలతో పాటుగా ఫ్యామిలీ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటుగా తన తల్లి నిర్మల కూడా వచ్చారు. బాలయ్య అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తూ పెళ్లికి ముందు ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని అడిగారు.
Advertisement
బన్నీ సమాధానం చెబుతూ.. మా పిల్లలు కూడా చూస్తారు. నేను వాళ్లకి ఒకే విషయం చెప్పాను. పెళ్లికి ముందు అమ్మని ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకున్నానని.. నా కొడుకుకి చెప్పానని బన్నీ అన్నారు. అయాన్ యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ లాంటివాడని.. తండ్రి కోసం ఏమైనా చేస్తాడని కానీ తల్లి విషయంలో ఏదైనా జరిగితే నన్ను కూడా వదలడు అని బన్నీ చెప్పారు. బన్నీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Also read:
పెళ్లికి ముందు నేను నాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్నేహారెడ్డికి చెప్పినట్లు చెప్పారు. ఆమె దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేదని.. ఇదివరకు జరిగిన కొన్ని విషయాలకు పెళ్లి అనేది ఒక రీసెట్ బటన్ అని.. కనుక నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆమెకు చెప్పానని బన్నీ వెల్లడించారు. స్నేహ తన జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయని చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!