మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతుల గురించి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన చిరంజీవి పై ఎలాంటి రూమర్లు గానీ ఎఫైర్ లకు సంబంధించిన విషయాలు గానీ ఇప్పటి వరకూ వినిపించలేదు. చిరు తన ఫ్యామిలీకి అంత ప్రాధాన్యత ఇస్తూ జెంటిల్ మెన్ అనిపించుకున్నారు. చిరంజీవి సురేఖ దంపతులు అన్యోన్య దంపతులు…వీరిని ఎందరో ఆదర్శంగా తీసుకుంటారు. ఇక సురేఖ ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కూతురు కాగా చిరంజీవి ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. కానీ చిరంజీవి తనకు నటన పై ఉన్న ఆసక్తితో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.
Advertisement
అల్లు రామలింగయ్యే తన కూతురును వివాహం చేసుకుని కోరేలా ఎదిగారు. ఇక సురేఖ చిరంజీవిల వివాహానికి ముందు కొన్ని ఆశ్యర్యకరమైన విషయాలు జరిగాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడప్పుడే తన టాలెంట్ తో ఎదుగుతున్నారు. అలాంటి సమయంలో అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖకు వివాహం చేయాలని అనుకున్నారు. చిరంజీవిలోని డెడికేషన్ ఆయన నటన అల్లు రామలింగయ్యకు ఎంతో నచ్చేశాయి.
Advertisement
దాంతో తన కూతురును చిరుకు ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. ఇక చిరు గురించి తెలుసుకోవాలని అల్లు అరవింద్ ను పిలిచి చెప్పారు. కానీ అల్లు అరవింద్ కు అసలు చిరంజీవి గురించి తెలియదు. దాంతో చిరంజీవి పై అల్లు అరవింద్ నిఘా పెట్టారు. చిరుతో పనిచేసిన దర్శకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. అందరూ చిరు మంచోడే అని చెప్పారు. ఇక చిరంజీవిని అల్లు అరవింద్ మొదటిసారి పున్నమినాగు సినిమా ప్రివ్యూ థియేటర్ లో కలిశారు.
అల్లు అరవింద్ ను చూసిన చిరు చెప్పండి సార్ అంటూ మాట్లాడారు. దాంతో అల్లు అరవింద్ చిరంజీవితో మా సురేఖను పెళ్లి చేసుకుంటారా అని నాన్నగారు అడమన్నారు అంటూ చెప్పారు. చిరు చేసుకుంటానని అన్నారు. అదేంటి చూడకుండానే ఓకే చెప్పేశారు అని అడగ్గా తాను శంకరాభరణం సినిమా ప్రివ్యూ సమయంలో తాను సురేఖను చూశానని చెప్పారు. ఆ తరవాత మెగాస్టార్ ఇంటికి వెళ్లి అల్లు రామలింగయ్య సంబంధం కుదుర్చుకున్నారు.