Home » వరుణ్ లవ్ ప్రేమ పై ముందే హింట్ ఇచ్చిన అల్లు అరవింద్…వీడియో వైరల్…!

వరుణ్ లవ్ ప్రేమ పై ముందే హింట్ ఇచ్చిన అల్లు అరవింద్…వీడియో వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ad

తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కు హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. లావణ్య వరుణ్ కలిసి మిస్టర్ అనే సినిమా లో నటించారు. అయితే ఈ సినిమా సమయం లోనే ఇద్దరు లవ్ లో పడినట్టు తెలుస్తోంది. ఆ తరవాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వచ్చింది.

alluaravind

Advertisement

 

అయితే వీరి పెళ్లి వార్తలు మొదలయ్యింది మాత్రం నిహారిక పెళ్లిలో. రాజస్థాన్ లో నిహారిక పెళ్లి జరగ్గా అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా వచ్చింది. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ ఫోటోలో లావణ్య త్రిపాఠి పోస్ ఇచ్చింది.

Advertisement

ఇక రీసెంట్ గా ఎంగెంజ్ మెంట్ ను అనౌన్స్ చేసి కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరుపుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠి గీత ఆర్ట్స్ బ్యానర్ లో చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో అల్లు అరవింద్ ఓ హింట్ ఇచ్చారు. లావణ్య నార్త్ నుండి వచ్చి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావ్. ఇక్కడే ఓ కుర్రాడ్ని చూసి పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేశాడు. దాంతో లావణ్య ఒక్కసారిగా అవాక్కయింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో మీరు అప్పుడే చెప్పారు. మేమే అర్థం చేసుకోలేదు అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading