వీకెండ్ సందర్భంగా ఐపీఎల్ లో ఈరోజు అభిమానులకు డబుల్ ధమాకా అనే విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ – కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ అదరగొట్టింది. ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (61) అర్ధశతకాలతో రాణించారు. ఆ తర్వాత కెప్టెన్ పంత్ 14 బంతుల్లో 27 పరుగులు చేయగా.. చివర్లో శార్దూల ఠాకూర్ 11 బంతుల్లో 29 పరుగులు, అక్షర్ పటేల్ 14 బంతుల్లో 22 పరుగులు చేసారు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2 వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, ఆండ్రీ రస్సెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Advertisement
Advertisement
ఇక 216 పరుగుల భారీ లక్ష్యంతో వచ్చిన కేకేఆర్ ఓపెనర్లు చేతులెత్తేయడంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ శేయార్ అయ్యర్ నితీష్ రాణాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిదే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీష్ ఔట్ కాగా.. 33 బంతుల్లో 54 పరుగులు చేసి అయ్యర్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ లో ఎవరు రాణించకపోవడంతో కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 171 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది.
Read More : చదువులో కూడా ముందున్న 7 స్టార్ క్రికెటర్లు…
ఈ ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ కు ఇది రెండో పరాజయం కాగా.. ఢిల్లీకి రెండో విజయం. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఢిల్లీ ప్రస్తుతం 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుండగా… ఓడిపోయిన కేకేఆర్ 6 పాయింట్లతో ఇంకా ఆగ్రా స్థానంలోనే ఉంది.