Home » ఆ సినిమానే మమల్ని కలిపింది అంటున్న అలియా…!

ఆ సినిమానే మమల్ని కలిపింది అంటున్న అలియా…!

by Azhar
Ad

రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంట పెళ్లి చేసుకొని మొత్తం అందరికి ఓ షాక్ ఇచ్చారు. వీరి పెళ్లి గ్రాండ్ గానే జరిగినా కూడా అది రహస్యంగా జరిగింది. అయితే ఈ జంట చాలా ఏళ్ళ నుండే ప్రేమించుకుంటుంది. కానీ వీరు పెళ్లి చేసుకుంటారు అని ఎక్కువ మంది అనుకోలేదు. అందుకు కారణం రణ్ బీర్ కపూర్. గతంలో కూడా రణ్ బీర్ కపూర్ చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు. కానీ ఆ ఆతర్వాత వారితో బ్రేకప్ అనేది చేసుకున్నాడు. ఇప్పుడు అలియాతో కూడా అలానే జరుగుతుంది అనుకున్నారు. కానీ వీరు పెళ్లి చేసుకొని అందరి నోర్లు మూయించారు.

Advertisement

అయితే తాజాగా అలియా భట్ తనకు రణ్ బీర్ కపూర్ మధ్య ప్రేమ అనేది బలపడానికి కారణాలను చెప్పింది. రణ్ బీర్ కపూర్ కంటే నాకు ఎప్పటి నుండో క్రష్ అని చెప్పిన అలియా.. మేము ఇద్దరం కలిసి ఎక్కువ సినిమా చేయలేదు. అయితే మా మధ్యలో ప్రేమ అనేది బలపడానికి కారణం బ్రహ్మాస్త్ర అనే సినిమానే అంటూ ప్రకటించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో మేము చాలా దగ్గరయ్యాము. అయితే ఈ సినిమా కోసం ఎక్కువగా కలిసి ప్రయాణించేవాళ్ళం. ఇక ఓ సారి రణ్ బీర్ కపూర్ విమానంలో తన సీట్ బాలేదు అని నా పక్కన ఉన్న సిటీలో వచ్చి కూర్చున్నాడు.

Advertisement

అప్పుడు మేము చాలా విషయాలు షేర్ చేసుకున్నాము. అప్పుడే మా ప్రేమ అనేది బలపడింది అని అలియా పేర్కొంది. ఇక ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో కనిపించిన అలియా తాను తల్లి కాబోతున్నాను అని ప్రకటించింది. ఈ కారణంగానే ఇప్పటికే ఒప్పుకున్న అన్ని సినిమాలను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు తమని దగ్గర చేసిన బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కోసం చూస్తుంది. అయితే ఈ మధ్యే వచ్చిన ఈ సినిమా ట్రైలర్ లో గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా ఉండటంతో ఇది అభిమానులను మెప్పించలేదు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐపై ఇర్ఫాన్ ఫైర్.. ఎందుకు రెస్ట్..!

సీఎస్‌కేపై మరోసారి కోపాన్ని చూపించిన జడేజా…!

Visitors Are Also Reading