Ad
ఒక్కపుడు మన ఇండియా సినిమా అంటే అందరికి కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేది. సౌత్ లో వచ్చే రీజనల్ సినిమాలు కేవలం ఒకటి వరకే పరిమితం అయ్యేవి. ఇక బాలీవుడ్ లో కూడా కథతో సంబంధం లేకుండా పెద్ద హీరో సినిమాలు వస్తే జనం ఎగబడేవారు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లోకి ఎక్కువగా నేపాటిజం వచ్చింది అనే వార్తలు వస్తున్న సమయంలో మన సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల కావడం ప్రారంభమయ్యాయి.
ఇక హిందీలో విడుదలైన ప్రతి సౌత్ సినిమా హిట్ కావడంతో అందరూ బాలీవుడ్ vs సౌత్ అంటూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అలాగే బాలీవుడ్ పని అయ్యిపోయింది అని కూడా చాలా మంది అన్నారు. కానీ హీరోయిన్ ఆలియా భట్ మాత్రం బాలీవుడ్ పని అయ్యిపోలేదు అని పేర్కొన్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై ఆలియా స్పందిస్తూ… మంచి కథ అనేది ఉంటె ఈ సినిమా అయిన హిట్ అవుతుంది.
అయితే కరోనా తర్వాత ఇండస్ట్రీకి చాలా కష్టాలు వచ్చాయి. దాదాపు రెండేళ్ల తర్వాత సినిమాలు థియేటర్ కు రావడంతో ప్రజలు ఏది మెచ్చుతారు అనే ఆలోచన ఎక్కువైంది. అలా అన్ని రెండు మూడు సినిమా ఆడకపోయినంత మాత్రాన బాలీవుడ్ పని అయ్యిపోదు. అలంటి వార్తలు అవాస్తవం అని ఆలియా పేర్కొంది. ఇక ఇప్పుడు తల్లికాబోతున్న ఆలియా ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించినా విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
ఇక మౌకా మౌకా యాడ్ కనిపించదట..!
గాయంపై రోహిత్ క్లారిటీ..!
Advertisement