మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటించగా… ఎన్టీఆర్ సరసన ఓలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రేయ, సముద్ర ఖని ఈ మూవీలో కీలకపాత్రల్లో నటించగా… ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
Advertisement
ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా భారీ కలక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలోని “నాటు నాటు” పాటకు గాను ఇప్పటికే ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. అలాగే ఈ మూవీకి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. ఈ మూవీ ద్వారా ఈ సినిమాలో నటించిన నటీనటులకు ఈ మూవీకి పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో తన పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ అలియా భట్ ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
Advertisement
ఆలియాభట్ ఈ మూవీలో సీత పాత్రలో నటించింది. ఈ పాత్రకు మొదటగా వేరే హీరోయిన్ ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించకపోవడంతో అలియా భట్ ను తీసుకున్నారట. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం… ఈ మూవీలో అలియా భట్ పాత్రకు గాను మొదటగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందనను మూవీ యూనిట్ అనుకుందట. అలాగే ఆ పాత్రకు సంబంధించిన స్కెచ్ లను కూడా వేయించారట. రష్మిక అందులో సీత పాత్రకు అద్భుతంగా సెట్ కావడంతో ఈ చిత్ర బృందం ఈ నటిని సంప్రదించిందట.
కాకపోతే అదే సమయంలో రష్మిక ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు డేట్ లను అడ్జస్ట్ చేయని కారణంగా ఈ సినిమాను చేయలేను అని చెప్పిందట. ఆ తర్వాత మూవీ యూనిట్ ఆలియా భట్ ను సంప్రదించగా ఈనటి కూడా అదే సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలి అనే కారణంతో ఈ సినిమా కోసం తేదీలను అడ్జస్ట్ చేసుకుందట. అలా రస్మిక మిస్ చేసుకున్న పాత్రలో ఆలియా నటించి అద్భుతమైన గుర్తింపును తెచ్చుకుంది.