సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ కి మరోసారి మొండిచేయి చూపించారు. అదిగో పదవి ఇదిగో పదవి అంటూ ఊరింపులతోనే సరిపెడుతున్నారా? స్వయంగా ముఖ్యమంత్రే పదవి ఇస్తానని హామీ ఇచ్చినా అది ఎందుకు అమలు కావడం లేదు? జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని ఆశలు పెట్టుకున్న అలీ కి నిరాశ తప్పలేదు. కొన్నాళ్ల క్రితం సినీ నటుడు అలీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి తీపికబురు అందబోతోంది అదేంటో వాళ్లే చెబితే బాగుంటుందంటూ ఉప్పొంగిపోయి చెప్పారు అలీ. అప్పట్లోనే రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో మైనారిటీ కోటాలో అలీకి తప్పకుండా ఒక సీటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కనీసం అభ్యర్థుల ఎంపిక పరిశీలన జాబితాలో కూడా అలీ పేరు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన అలీ జనసేనానిని కాదని 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. అంతకుముందు అలీ తెలుగుదేశం పార్టీలో పని చేశారు. టిడిపి నుంచి కూడా ఆయన టికెట్ ఆశపడి భంగపడ్డారు. వైసీపీ కూడా టికెట్ ఇవ్వలేదు కానీ గెలిచాక నామినేటెడ్ పదవి ఏదో ఒకటి ఇస్తారని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.ఈ మూడేళ్లలో ఏ నామినేటెడ్ పదవి భర్తీ జరిగినా అలీ పేరు వినిపించేది.ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ఒకసారి, మంత్రి పదవి ఇస్తారని మరోసారి ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభ సీటు వ్యవహారంలోనూ ఇదే జరిగింది. అయితే చివరకు నిరాశే మిగిలింది. కానీ ఒక రకంగా సీఎం అలీకి ప్రాధాన్యత ఇస్తున్నారనే చెప్పాలి. అయితే ప్రతిసారి అలీ పేరు తెరపైకి రావడం, తుది జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడం షరా మామూలుగా మారిపోయింది. ఇప్పటికైనా సినీనటుడు అలీకి మంచి పదవి దక్కాలని కోరుకుందాం.
Advertisement
ALSO READ;
Advertisement
పంతం నీదా నాదా అంటూ.. సూపర్ స్టార్- మెగాస్టార్ మధ్య పోటీ.. ఏం జరిగిందంటే..??
భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించకుంటే వచ్చే సమస్యల గురించి తెలుసా ?