ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఐన్‌స్టీన్ ఒకరు. భౌతిక శాస్త్రంలో ఆయన కనిపెట్టిన, రూపొందించిన సిద్దాంతాలు ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఇప్పటికీ ఆయన సిద్దాంతాలను సైన్స్ రంగంలో వినియోగిస్తున్నారు. ఎన్నో ఆవిష్కరణలకు ఐన్‌స్టీన్ సిద్దాంతాలు మూలం అని చెప్పాలి. పరిశోధనలో మునిగిపోతే తనకు ఏమీ గుర్తుండవు. చేసే పనిలో లీనమైపోతాడు. అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు.
Also Read: పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..
Advertisement
Advertisement
ఐన్‌స్టీన్ లాంటి గొప్ప వ్యక్తిని వివాహం చేసుకున్న భార్య గొప్ప అదృష్టవంతురాలని అనుకుంటాం. అలాంటిదేమి కాదట. వివాహానికి ముందు కాబోయే భార్య మిలేవాకు 7రకాల కండీషన్లు పెట్టాడట ఐన్‌స్టీన్. తన బట్టలను శుబ్రంగా ఉతికి, నీట్‌గా ఉంచాలి. భోజనాన్ని తన రూమ్‌కు తీసుకురావాలి. బెడ్రూమ్, స్టడీరూమ్ రెండింటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయన తప్ప ఎవరూ తన డెస్క్‌ను వినియోగించకూడదు.
ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మిలేవా తనతో కూర్చోకూడదు. విషయంలో బలవంతపెట్టకూడదు. ఐన్‌స్టీన్ మాట్లాడితేనే మాట్లాడాలి లేదంటే కామ్‌గా బుక్స్ చదువుకోవాలి. పిల్లల ముందు ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలాంటి కండీషన్స్ పెట్టడంతో 20 సంవత్సరాల పాటు ఒపిగ్గా ఆయనతో కాపురం చేసింది. ఆ తరువాత ఆమె ఐన్‌స్టీన్ నుంచి విడిపోయింది.
Also Read: పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..