పాకిస్తాన్ భారత్ లో పర్యటించడాన్ని నేను ఎప్పుడూ సమర్థిస్తాను. ఎందుకంటే ఇండియా డబ్బుతోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డెవలప్ అవుతుంది. ఈ మాట అన్నది మరెవరో కాదు రాహుల్ ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తార్. వన్డే ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ గడ్డపై ఆడేందుకు పాక్ మొదటి నుంచి గోల పెట్టింది. ఏవేవో బూచి కారణాలు చెబుతూ సాగదీసింది. ఫైనల్ గా మనదేశంలో ఆడేందుకు అంగీకరించింది.
Advertisement
తాజాగా షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. పాకిస్తాన్, భారత్ ను పర్యటించకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఎక్కువ డబ్బు భారత్ నుంచే పాకిస్తాన్ కి వస్తుంది. ఈ డబ్బు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి కూడా అందుతుంది. ఇది మన దేశ వాళీ క్రికెట్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నడిపేది భారత్ సొమ్ము. అందుకే పాకిస్తాన్ భారత్ ను పర్యటించడాన్ని నేనెప్పుడూ సమర్ధిస్తానని చెప్పాడు. విరాట్ కోహ్లీ మిగతా రెండు ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ పై దృష్టి పెడితే బాగుంటుంది. కోహ్లీ మరో ఆరేళ్ల పాటు ఆడగలడు. కోహ్లీ, సచిన్ 100 సెంచరీల రికార్డులను బ్రేక్ చేయడానికి ప్రయత్నించాలని అభిప్రాయపడ్డాడు.
Advertisement
అయితే కోహ్లీ టెస్ట్ మాత్రమే ఆడాలని షోయబ్ చెప్పడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు ఫార్మాట్లలో సత్తా చాటగల కింగ్ కోహ్లీ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం ఏంటని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ గురించి షోయబ్ చేసిన కామెంట్లకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కౌంటర్ పాస్ చేశాడు. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను ఏ ఫార్మాట్ లో అయినా ఆడగలడు. తాను మూడు ఫార్మాట్లలో ఆడాలని సూచించాడు.
ఇవి కూడా చదవండి
సీఎం కేసీఆర్ పార్టీకి అల్లు అర్జున్ ప్రచారం…!
ఆ స్టార్ హీరో కోసం 6 రోజులు అన్నం మానేసిన శ్రీదేవి…?