Home » Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. ఈ సారైనా హిట్‌ కొడతారా ?

Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. ఈ సారైనా హిట్‌ కొడతారా ?

by Bunty
Ad

అక్కినేని వారసుడు అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ‘సిసింద్రీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, అమాయకమైన నవ్వుతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత ‘మనం’ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమాలేవి సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.

Akhil movie under the supervision of Rajamouli

Akhil movie under the supervision of Rajamouli

తాను చేసే ప్రతి ఒక్క సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోతుంది. దీంతో నిర్మాతలకు కూడా భారీగానే నష్టం వాటిల్లుతోంది. క్లాస్, మాస్, రొ**మాన్స్ అన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా విజయం మాత్రం రాలేకపోతోంది. ఇక రీసెంట్ గా అఖిల్ నటించిన తాజాచిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమాతో అఖిల్ రేంజ్ మరింత దిగజారిపోయింది. ఇక అఖిల్ మరో కొత్త దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి ‘ధీర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

Advertisement

Advertisement

ఈ సినిమా మొత్తం రాజమౌళి సమక్షంలో జరుగుతోందట. ఈ సినిమాకి సంబంధించి సలహాలు, సూచనలు, కథలో మార్పులు, చేర్పులు అన్ని రాజమౌళి చూసుకుంటున్నాడట. ఇక అఖిల్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడని తెలిసి అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అఖిల్ కొత్త సినిమా 2024 లోనే తెరపైకి రాబోతోందట. ఇక ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading