సినిమా ఇండస్ట్రీలో కలిసి తిరిగారంటే వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా రకరకాల గాసిప్ లు రావడం కామన్. ఇప్పుడు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాత్ హీరోయిన్ చార్మీ కౌమ్ మధ్య కూడా అలాంటి గాసిప్ లే వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాత్ చార్మీ హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తరవాత వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.
Advertisement
ఈ సినిమా తరవాత పూరీ లేకుండా చార్మీ లేదు అన్నట్టుగా మారిపోయింది. చార్మీ నిర్మాతగా మారి పూరీ జగన్నాత్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణసంస్థలో సినిమాలను నిర్మిస్తోంది. ఈ సినిమాలను పూరీజగన్నాత్ చార్మీ కలిసి నిర్మిస్తున్నారు. అప్పటి నుండి ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లినా ఇద్దరూ కనిపిస్తారు. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతే కాకుండా పూరిజగన్నాత్ కు ఆయన భార్య విడాకులు ఇవ్వబోతుందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
అయితే ఇదే ప్రశ్న తాజాగా పూరీ తనయుడు ఆకాష్ పూరీకి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఆకాష్ పూరీ హీరోగా వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజా చోర్ బజార్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకుల వార్తల పై స్పందించాడు. మా నాన్న దగ్గర ఏమీ లేనప్పుడు కేవలం 200 రూపాయలు జేబులో పెట్టుకుని పెళ్లి చేసుకుందాం వస్తావా అని అమ్మని అడిగాడు.
దాంతో మా నాన్న పై ఉన్న నమ్మకంతోనే అమ్మ ఇంటి నుండి వచ్చేసింది. మా నాన్న అంటే అమ్మకి అంత ఇష్టం అలాంటప్పుడు ఎందుకు విడాకులు ఇస్తుంది. వారిద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. మా నాన్న సంపాదించింది అంతా పోయినప్పుడు మా పరిస్థితి వేరు. కారు ఇల్లు అన్నీ పోయాయి. అలాంటి పరిస్థితులు మాకు తెలియకుండా నన్ను మా చెల్లిని అమ్మ హాస్టల్ లో చదివించింది. నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి అమ్మే కారణం. వాళ్లది ప్యూర్ లవ్..రాసే వాళ్లు టైం పాస్ కోసం రాస్తారు.. అంటూ ఆకాష్ పూరీ విడాకుల వార్తలను కొట్టిపారేశాడు.
Also read : గీతాంజలి సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెక్కడ ఉందంటే ?