చిత్రపరిశ్రమలో తరచూ విడాకుల వార్తలు వినిపిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే సెలబ్రెటీ జంటలు విడాకులు తీసుకోవడం అభిమానులను షాకింగ్ గా మారింది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు విడిపోయారు. టాలీవుడ్ లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ :మంచు, అక్కినేని ఫ్యామిలీకి ఆ ఒక్కటి కలిసి రావడం లేదా..?
Advertisement
వారివిడాకుల వార్తలను మరవకముందే కోలీవుడ్ హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ కపుల్ విడిపోతున్నట్టు గా వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ హీరో మరెవరో కాదు…కోలీవుడ్ స్టార్ అజిత్ తన భార్య షాలినితో విడాకులు తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
ALSO READ : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ
Advertisement
వీరి వివాహం జరిగి దాదాపుగా 21 ఏళ్లు అవుతోంది. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ దంపతులు విడాకులు తీసుకునేందుకు సిద్దం అయ్యారని కోలీవుడ్ లో జోరుగాప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ వార్తలకు దర్శకుడు రమేష్ కన్నా చేసిన కామెంట్ లు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో రమేష్ కన్నా మాట్లాడుతూ….అజిత్ షాలినిలు ప్రేమించుకుంటున్న సమయంలోనే వారికి వద్దని చెప్పానని అన్నారు. భార్య భర్తల మధ్య గొడవలు సహజం అని వారు విడిపోతారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇన్ని రోజులు వారి సంసారం ఎలా గుట్టుగా సాగిందో అదేవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ALSO READ :తారకరత్న ఆస్పత్రి బిల్ కట్టింది బాలయ్య కాదు..లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!