స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకుంటున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 17న వీరిద్దరూ తాము ఓడి పోతున్నామని…. అయినప్పటికీ స్నేహితులుగా కలిసి ఉంటామని సంచలన ప్రకటన చేశారు. అయితే రజినీకాంత్….తన కూతురు మరియు అల్లుడును కలిపేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.
అయితే వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ధనుష్ తండ్రి మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ తాజాగా ఐశ్వర్య చేసిన పని చూస్తుంటే వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం లేదని అర్థమవుతోంది. ఐశ్వర్య ధనుష్ తో విడిపోతున్నట్టు జనవరిలో ప్రకటించింది. కానీ ఆమె పేరు వెనక ధనుష్ పేరును సోషల్ మీడియాలో తొలగించలేదు.
Advertisement
Advertisement
దాంతో మళ్ళీ ఇద్దరూ కలిసే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య సోషల్ మీడియాలో ధనుష్ పేరును తొలగించి తాము విడిపోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా ధనుష్ పేరును తొలగించి తన పేరు తండ్రి పేరు రజినీకాంత్ ను తగిలించుకుంది.
ఇదిలా ఉండగా విడాకుల ప్రకటన తర్వాత ఐశ్వర్య తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇదివరకు ఐశ్వర్య సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐశ్వర్య బాలీవుడ్ ల ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతోంది. ధనుష్ విషయానికి వస్తే ఎలాగూ కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ ధర్శకుడు శేకర్ కమ్ముల తో సార్ అనే సినిమా చేస్తున్నాడు.